Home > క్రికెట్ > స్కై హాఫ్ సెంచరీ..విండీస్ ముందు ఓ మోస్తరు లక్ష్యం..

స్కై హాఫ్ సెంచరీ..విండీస్ ముందు ఓ మోస్తరు లక్ష్యం..

స్కై హాఫ్ సెంచరీ..విండీస్ ముందు ఓ మోస్తరు లక్ష్యం..
X

వెస్టీండ్‌స్‌తో జరుగుతున్న ఫైనల్ టీ20 మ్యాచ్‌లో భారత్ ఓ మోస్తరు స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ అర్ధసెంచరీ( 45 బంతుల్లో 61) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. తిలక్ వర్మ 18 బంతుల్లో 27 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. గత మ్యాచ్ ల్లో చెలరేగిన యువ ఓపెనర్లు జైశ్వాల్, గిల్ ఈ సారి పూర్తి విఫలమయ్యారు. సంజూ శాంసన్, పాండ్యా మరోసారి నిరాశపరిచారు. విండీస్ బౌలర్లలో రొమారియా షెఫర్డ్ 4, అకీల్ హోసీన్ 2, జేసన్ హోల్డర్ 2, రోస్టన్ చేజ్ ఒక వికెట్ తీశారు.





Updated : 13 Aug 2023 10:25 PM IST
Tags:    
Next Story
Share it
Top