Home > క్రికెట్ > వెస్టిండీస్‌ టూర్‌‌కు భారత్ జట్టు ఎంపిక

వెస్టిండీస్‌ టూర్‌‌కు భారత్ జట్టు ఎంపిక

వెస్టిండీస్‌ టూర్‌‌కు భారత్ జట్టు ఎంపిక
X

వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. వన్డే, టెస్ట్ జట్టులను వెల్లడించింది. రోహిత్ శర్మనే కెప్టెన్‎గా వ్యవహరించనున్నాడు. వెస్టిండీస్ టూర్‌లో పలువురు యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్‌కు రెండు జట్లలో చోటు దక్కింది. వన్డే టీమ్‍లోకి సంజూ శాంసన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. టెస్ట్ జట్టులో నుంచి పుజారాను పక్కన పెట్టారు. wtc ఫైనల్ ద్వారా జట్టులోకి పునరాగామనం చేసి అజింక్య రహానే టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ దక్కింది. జైశ్వాల్ కూడా టెస్ట్ జట్టులో కొనసాగుతున్నాడు. మహమ్మద్ షమీకి విశ్రాంతిని ఇచ్చారు సెలెక్టర్లు. అతడి స్థానంలో పేసర్ నవ్ దీప్ సైనీకి టెస్టుల్లో అవకాశం కల్పించారు. పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు టెస్ట్‎లతో పాటు వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. టీ20 జట్టును భారత్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. వెస్టిండీస్ పర్యటనలో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది. జూలై 12న డొమెనికా వేదికగా విండీస్‍తో తొలి టెస్టు ప్రారంభం కానుంది.

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ , విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహల్, కుల్‍దీప్ యాదవ్, జయ్‍దేవ్ ఉనాద్కత్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్

భారత టెస్ట్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జయ్‍దేవ్ ఉనాద్కత్, నవ్‍దీప్ సైనీ

టెస్ట్ సిరీస్

మొదటి టెస్ట్: జులై 12-జులై 16

రెండవ టెస్ట్: జులై 20-జులై 24


వన్డే సిరీస్:

మొదటి వన్డే: జూలై 27

రెండవవన్డే: జూలై 29

మూడవ వన్డే: ఆగస్టు 1

T20 సిరీస్:

మొదటి టీ20: ఆగస్టు 3

రెండవ టీ20: ఆగస్ట్ 6

మూడవ టీ20: ఆగస్ట్ 8

నాల్గవ టీ20: ఆగస్టు 12

ఐదవ టీ20: ఆగస్టు 13






Updated : 23 Jun 2023 4:56 PM IST
Tags:    
Next Story
Share it
Top