భారత్ గెలుపు అవకాశాలున్నాయి.. కానీ, భారం మొత్తం వాళ్లపైనే
X
వరల్డ్ టెస్ట్ ఛాంపియర్ షిప్ ఫైనల్ లో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయినా.. ఆస్ట్రేలియాకు ఆధిక్యం దక్కింది. మూడో రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 4 వికెట్లు కోల్పోయింది. భారత్ గెలుపు అవకాశాలను చేజిక్కించుకోవాలంటే.. 4వ రోజు 6 వికెట్లను పడగొట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం 300 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. ఆలౌట్ అయ్యేసరికి భారీ పరుగులు చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థుతుల్లో టీమిండియా గెలుపుపై ఆశలు రేగుతున్నాయి.
ఈ క్రమంలో టీమిండియాకు ఈజీ అవుతుందని ఏం చెప్పలేం. మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ బౌలర్ల అద్భుత ప్రదర్శన కనబరిచారు. అదే రిపీట్ అయితే భారత బ్యాట్స్ మెన్ కు కఠిన సవాలు ఎదురవుతుంది. తొలి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన టాప్ ఆర్డర్.. ఈ ఇన్నింగ్స్ లో రాణించాల్సి ఉంటుంది. రహానే, శార్ధుల్ లాగ పట్టుదలగా క్రీజ్ లో నిలపడాల్సి వస్తుంది. మిగతా బ్యాటర్లూ తొలి ఇన్నింగ్స్ పోరాటాన్ని పునరావృతం చేస్తే కప్పు కొట్టుకొస్తారు.