Home > క్రికెట్ > మొదటి మ్యాచ్ గెలిచి బోణీ కొట్టిన భారత్

మొదటి మ్యాచ్ గెలిచి బోణీ కొట్టిన భారత్

మొదటి మ్యాచ్ గెలిచి బోణీ కొట్టిన భారత్
X

వెస్టీండీస్ తో మూడు వన్టేల్లో భారత్ బోణీ కొట్టేసింది. 5వికెట్ల తేడాతో గెలిచేసింది. సూపర్ ఇన్నింగ్స్ తో ఇషాన్ కిషన్ అదరగొట్టగా కులదీప్ యాదవ్, అజయ్ జడేజాలు స్పిన్ తో మాయ చేసి పడేశారు.

మొదటి విండీస్ జట్టు బ్యాటింగ్ చేసింది. స్పిన్నర్లు అద్భుతంగా రాణించడంతో ఆతిధ్య జట్టును 114 పరుగులకే కట్టడిచేయగలిగారు. తరువాత బ్యాటింగ్ కు దిగిన భారత్ కు లక్ష్య చేధన చాలా చిన్నదే అయినా కాస్త తడబడింది. అనవసరంగా వికెట్లు చేయిజార్చుకుంది. రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ ఒక్కడే బాగా రాణించాడు. 46 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్స్ తో హాప్ సెంచురీ చేశాడు. శుభ్ మన్ గిల్ 7, హార్దిక పాండ్యా 5 నిరాశపర్చారు. సూర్యకుమార్ యాదవ్ 19 పురుగులు చేయగా...రవీంద్ర జడేజా 16, రోహిత్ శర్మ12 నాటౌట్గా నిలిచి గెలిపించారు.

మొత్తం మ్యాచ్ కు ఇషాన్ ఇన్నింగ్స్ సూపర్ హైలట్. ఒక పక్కన సహచరుల వికెట్లు కోల్పోయినా తాను మాత్రం నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచురీ చేసాడు.

https://youtu.be/7JDh5NVv958

అలాగే మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ కొట్టిన సిక్స్ కూడా హైలట్ గా నిలిచింది. లెగ్ సైడ్ కోట్టిన సిక్స్ వావ్ అనిపించింది.

https://twitter.com/FanCode/status/1684606801982226432?s=20

స్పిన్నర్లలో కులదీప్ యాదవ్ విండీస్ బ్యాటర్లను హడలెత్తించాడు. కీలకమైన ఫైహోప్, డొమినిక్ డ్రేక్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే టెయిలెండర్లు కారీ, సీల్స్ ను ఔట్ కూడా చేశాడు. మూడు ఓవర్లలో ఆరుపరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

https://youtu.be/nvZdlpo_pIo

మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా కొంచెం ఎక్కువ పరుగులే ఇచ్చినా విండీస్ బ్యాటర్ హెట్ మయేర్ ను అవుట్ చేసిన విధానం మాత్రం సూపర్ గా ఉంది. మిడిల్ నుంచి లెగ్ వికెట్ మీదుగా వేసిన బాల్ ను కొట్టేందుకు ప్రయత్నించిన హెట్ మేయర్ అంచనా తప్పాడు. దీంతో అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. అలాగే రొమారియో షెఫెర్డ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు కానీ దాన్ని విరాట్ సెకండ్ స్లిప్ లో విరాట్ అద్బుతంగా క్యాచ్ పట్టడంతో అవుటై వెనుదిరిగాడు. జడేజా 6 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.

https://youtu.be/NB2LutfMz_g


Updated : 28 July 2023 4:20 AM GMT
Tags:    
author-thhumb

Veerendra Prasad

వీరేందర్ మైక్ టీవీ వెబ్‌సైట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌(సబ్ ఎడిటర్)గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో(V6, T News) రాజకీయం, లైఫ్ స్టైల్, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.


Next Story
Share it
Top