Home > క్రికెట్ > ఓడిపోయింది కానీ ఎవ్వరికీ దక్కని రికార్డ్ మాత్రం నమోదు చేసుకుంది

ఓడిపోయింది కానీ ఎవ్వరికీ దక్కని రికార్డ్ మాత్రం నమోదు చేసుకుంది

ఓడిపోయింది కానీ ఎవ్వరికీ దక్కని రికార్డ్ మాత్రం నమోదు చేసుకుంది
X

ఐర్లాండ్ తో మొదటి మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. 2 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ బుమ్రా మొదట బౌలింగ్ ను ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఆ దేశం బ్యాట్స్ మెన్ మెక్ కార్తీ 51, కర్టీస్ కాంపర్ 39 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇండియా 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. తర్వాత వర్షం పడడంతో మ్యాచ్ ఆగిపోయింది. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 2 పరుగుల తేడాతో భారత్ గెలిచిందని అంపైర్లు ప్రకటించారు.





ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ టీమ్ ఓడిపోయింది. కానీ ఏ దేశానికీ సాధ్యం కానీ రికార్డ్ ను మాత్రం సొంతం చేసుకుంది. అది కూడా రెండుసార్లు. అదేంటంటే...భారత్ మీద బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ టీమ్ 139 పరుగులు చేసింది. అంటే మిగతా వంద పరుగులు తరువాత వచ్చిన బ్యాట్స్ మన్ చేశారు. ఐర్లాండ్ టీమ్ ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే పరుగులు చేసింది. 2022లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో 25 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఏకంగా 137 పరుగుల చేశారు.

ఐర్లాండ్ సాధించిన ఈ ఫీట్ టీ20 క్రికెట్ లో వరల్డ్ రికార్డ్. ఇప్పటివరకూ ఇండియాతో సహా ఏ దేశమూ ఇలా పరుగులు చేయలేదు. ఒక్క ఐర్లాండ్ టీమ్ మాత్రమే రెండు సార్లు చేసింది. అందుకే ఆ దేశానికి ఈ ఘనత దక్కింది.


Updated : 19 Aug 2023 7:56 PM IST
Tags:    
Next Story
Share it
Top