హైదరాబాద్ కుర్రాడు దూసుకుపోతున్నాడు
X
భారత్ క్రికెట్ లో ఇప్పుడు మారుమోగుతున్న పేరు తిలక్ వర్మ. ఐపీఎల్ లో తన సత్తా ఏంటో చూపిన తిలక్ వర్మ నెమ్మదిగా భారతజట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఆసియా కప్ లోనూ స్థానం సంపాదించి తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు.
తిలక్ వర్మ హైదరాబాద్ కుర్రాడు. చాలా తక్కువ వ్యవధిలోనే ఇతను ఎదిగిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తిలక్ వర్మకు ప్రతిభ ఉంది. దానికి తోడు అదృష్టం కూడా తోడవుతోంది. ఎందరో కలలు కనే భారత జట్టులోకి అత్యంత వేగంగా, చిన్న వయసులో చోటు సంపాదించుకునేలా చేసింది. భాతర్ నుంచి లక్షల్లో క్రికెట్ ఆడడం కోసం క్యూల్లో వెయిట్ చేస్తుంటారు. అందరికీ అవకాశం దక్కదు. కానీ అవకాశాలు ఒకదాని తర్వాత ఒకటి తిలక్ వర్మ తలుపు తడుతున్నాయి. హైదరాబాద్ నుంచి మహ్మద్ సిరాజ్ తరువాత అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆటగాడు తిలక్ వర్మ ఒక్కడే.
తిలక్ వర్మ లెఫ్ట్ హ్యండర్ బ్యాట్స్ మన్. ఇది అతడికి బాగా కలిసి వస్తున్న అంశం. వెస్టిండీస్ తో టీ20 సీరీస్కు మొదటిసారి భారత్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంచనాలకు తగ్గట్టుగానే 5 మ్యాచుల్లో 173 పరుగులు చేసి మెప్పించాడు. అప్పుడు ఆ ప్రదర్శనే అతడిని ఆసియా కప్ వన్టే జట్టులో చోటు సంపాదించుకునేలా చేసింది. తిలక్ వర్మ నిలకడగా ఆడుతున్నాడు. అతను రోజురోజుకూ పరిణితి సాధిస్తున్నాడు. ఇతడి ఆటతీరు చూసిన ఎంతో మంది మాజీ క్రికెటర్లు అతనికి మద్దతు పలుకుతున్నారు. వరల్డ్ కప్ కు ఎంపిక చేస్తే ఉపయోగపడతాడని అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి వారు ఫిట్ నెస్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది కూడా అతనికి బాగా కలిపి వస్తోంది.
టీమ్ ఇండియాలో బ్యాటింగ్ లైనప్ లో నాలుగో స్థానంలో సరైన వారు లేక ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు. తిలక్ వర్మ ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగేలా కనిపిస్తున్నాడు. అతను కనుక ఆసియా కప్ లో బాగా ఆడితే, వరల్డ్ కప్ టైమ్ కు శ్రేయస్ అందుబాటులో లేకపోతే కచ్చితంగా తిలక్ ఎంపిక అవుతాడని అంటున్నారు క్రికెట్ ఎనలిస్ట్ లు.