"జట్టులోకి మరో ధోని వచ్చాడు"
X
రింకూసింగ్.. ఐపీఎల్ 2023 లో సత్తాచాటిన క్రికెటర్. కేకేఆర్ తరపున సంచలన ఇన్సింగ్స్‌లతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆఖరి 5 బంతులకు 5 సిక్స్‌లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా రింకూ సింగ్ పేరు మారుమోగిపోయింది. ఐపీఎల్ లో రాణించడంతో టీమిండియాలో స్థానం సంపాదించడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. వెస్టిండీస్ పర్యటనకు పట్టించుకోని సెలెక్టర్లు.. చైనా వేదికగా జరిగే ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేశారు. ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులోనూ అవకాశం కల్పించారు.
శుక్రవారం జరిగిన ఐర్లాండ్ తో జరిగిన మొదటి టీ20 ద్వారా రింకూ ఆరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు. దీంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాజాగా ఈ యంగ్ ప్లేయర్‌పై మాజీ క్రికెటర్ కిరణ్ మోర్ ప్రశంసలు కురిపించాడు. భారత్ బెస్ట్ ఫినిషర్ గా రింకూ తయారవుతాడని జోష్యం చెప్పాడు. మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ తర్వాత రింకూసింగ్ రూపంలో మంచి ఆటగాడు దొరికాడని చెప్పాడు. నంబర్ 5, 6లో అతను అద్భుతంగా ఆడగలడని వివరించాడు. ఫినిషర్ రోల్‌లో చాలా మంది ఆటగాళ్లను ప్రయత్నించినా.. కానీ ఫలితం దక్కలేదని చెప్పాడు. ప్రస్తుతం జట్టులో తిలక్ వర్మ, రింకూ సింగ్‌లు ఫినిషర్స్ గా పనికొస్తారని వివరించాడు. రింకూసింగ్ మంచి బ్యాటర్ తో పాటు మంచి ఫీల్డర్ అని కొనియాడాడు.