కొత్త సాంగ్ తో మీ ముందుకు వస్తున్నా అంటూ హిమాన్షు ట్వీట్
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు హిమాన్షు గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్యనే ఓ స్కూలును దత్తతకు తీసుకుని దాన్ని బాగుచేయించి వార్తల్లో నిలిచాడు. ఇతనిలో నాయకత్వ లక్షణాలు చాలా ఉన్నాయని అందరూ అంటుంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే హిమాన్షు మంచి సింగర్ కూడా. సోషల్ మీడియాలో తన పాటలను అప్ లోడ్ చేస్తూ ఉంటాడు. ఇంతకు ముందు హాలీవుడ్ పాప్ స్టార్ జేవీకే పాడి అందరినీ శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి కొత్త సాంగ్ తో రాబోతున్నాని అనౌన్స్ చేశాడు.
జులై 24న తన కొత్త పాట రిలీజ్ చేస్తున్నాని ప్రకటించాడు హిమాన్షు. ఈ ప్రకటన తనకు చాలా సంతోషాన్ని ఇస్తోందని...మీరు కూడా ఈ పాట విని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నానని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. దీనికి తండ్రి కేటీఆర్ స్పందించారు. లుకింగ్ ఫార్వార్డ్ ఈగర్లీ అంటూ రీట్వీట్ చేశారు. హిమాన్షు మొదటి కవర్ సాంగ్ తాత కేసీఆర్ పుట్టినరోజు నాడు రిలీజ్ చేశాడు. అప్పట్లో కూడా తన కొడుకు టాలెంట్ ను చూడండి అంటూ కేటీఆర్ ట్వీట్లు, కామెంట్ల వర్షం కురిపించారు. ఇప్పుడు కూడా తనయుడిని ఎంకరేజ్ చేస్తూ రీట్వీట్ చేశారు.