Asia Cup 2023 : ఆసియా కప్ కోసం నిప్పులమీద నడిచిన క్రికెటర్...
X
మరో పది రోజుల్లో ఆసియా కప్ మొదలవుతుంది. దీని కోసం అన్ని దేశాల ఆటగాళ్ళు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చాలా ఏళ్ళకు జరుగుతున్న ఈ టోర్నీ కోసం ఆటగాళ్ళు ఎదురు చూస్తున్నారు. అందులోనూ వరల్డ్ కప్ ముందు జరుగుతుండడంతో ఇది మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ ఆటగాళ్ళు ఢాకాలోని నేనల్ క్రికెట్ అకాడమీలో తెగ ప్రాక్టీస్ చేసేస్తున్నారు.
ఇందులో భాగంగానే బంగ్లా క్రికెటర్ మహ్మద్ నయీమ్ నిప్పుల మీద నడిచాడు. మానసిక ఒత్తిడి తట్టుకునేందుకు నయీమ్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. అందులో ఇలా నిప్పుల మీద నడవడం కూడా ఒకటి. సబిత్ రేహాన్ అనే ట్రేనర్ సహాయంతో నయీమ్ ఈ ఫీట్ చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
క్రీడాకారులు ఇలా నిప్పుల మీద నడవడం ఇదే మొదటిసారి కాదు. నయీమ్ మొదటీవాడూ కాదు. ఇది చాలా కాలం నుంచి ప్రపంచచ వ్యాప్తంగా క్రీడాకారులు ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. తమలోని ధైర్యాన్ని పంచుకోవడానికి, మానసికంగా ధృడంగా ఉండి...ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్ట్రాంగ్ గా ఉండడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆసియా కప్ ఈనెల 30 నుంచి మొదలవుతుంది. ఇందులో బంగ్లాదేశ్ తమ మొదటి మ్యాచ్ ను ఆగస్టు 31న శ్రీలంకతో ఆడనుంది.