క్రికెట్ లవర్స్ గెట్ రెడీ.. 'బుక్ మై షో'లో వరల్డ్ కప్ టికెట్లు
X
భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023కు రంగం సిద్ధమైంది. అయితే మెయిన్ టోర్నీకి ముందు సన్నాహకంగా జరిగే వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్(సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు)ను ఐసీసీ బుధవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. టోర్నీలో 10 జట్లు పాల్గొననున్నాయి. హైదరాబాద్, తిరువనంతపురం, గువహటి వేదికగా ఈ వార్మప్ మ్యాచులు జరగనుండగా.. భారత్ తమ తొలి వార్మాప్ మ్యాచ్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో గువహటి వేదికగా( సెప్టెంబర్ 30న) ఆడనుంది.
ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు టిక్కెట్ ప్లాట్‌ఫారమ్‌గా BookMyShowని ఎంపిక చేసింది బీసీసీఐ. సెప్టెంబర్ 29న సన్నాహక మ్యాచ్‌లతో వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. క్రికెట్ కోలాహలం నవంబర్ 19 వరకు కొనసాగుతుంది. అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను స్టేడియం స్టాండ్‌ల నుండి చూసే అవకాశం ఉంటుంది. ప్రధాన మ్యాచ్‌లు, వార్మప్ మ్యాచ్‌లు కలిపి మొత్తం 58 మ్యాచ్‌ల టికెట్లను ఈ బుక్ మై షో ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేయొచ్చని తెలిపింది. టీమ్ఇండియా మినహా ఇతర జట్ల వార్మప్ మ్యాచ్‌లు, ప్రధాన మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు ఈ నెల ఆగస్ట్ 25 నుంచి అందుబాటులో ఉండనున్నాయని తెలిపింది.
ఇండియాకు సంబంధించిన మ్యాచ్‌ల టికెట్లు ఆగస్ట్ 30 నుంచి అందుబాటులో ఉంటాయి. అయితే బోర్డు స్పాన్సర్లలో ఒకరైన మాస్టర్ కార్డ్ వినియోగదారులకు మాత్రం ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చారు. ఒకరోజు ముందుగానే(ఆగస్ట్ 24 సాయంత్రం 6 గంటల నుంచే) టికెట్లు అందుబాటులో ఉంటాయి. టీమ్ఇండియా ఆడే మ్యాచుల టికెట్లు ఆగస్ట్ 29 సాయంత్రం 6 గంటల నుంచే ఉంటాయి. టీమ్ఇండియా ఆడే వార్మప్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు ఈ నెల 30 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అలాగే టీమ్ఇండియా ఆడే ప్రధాన టోర్నీ మ్యాచ్ టికెట్లను నాలుగు ధపాలుగా విడుదల చేయనున్నారు.
చెన్నై, దిల్లీ, పుణెలో టీమ్ఇండియా ఆడే మ్యాచ్‌లకు ఆగస్టు 31 రాత్రి 8నుంచి నుంచి, ధర్మశాల, లఖ్‌నవూ, ముంబయిలో ఆడే మ్యాచ్‌లకు సెప్టెంబర్ 1 రాత్రి 8నుంచి నుంచి, బెంగళూరు, కోల్‌కతాలో ఆడే మ్యాచ్‌లకు సెప్టెంబర్ 2 రాత్రి 8నుంచి నుంచి, అహ్మాదాబాద్‌లో జరిగే టీమ్ఇండియా మ్యాచ్‌కు సెప్టెంబర్ 3 రాత్రి 8నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.సెమీఫైనల్, ఫైనల్‌కు సంబంధించిన టికెట్లను సెప్టెంబర్ 15 రాత్రి 8 నుంచి అందుబాటులో ఉంటాయి. బీసీసీఐ విడుదల చేయనుంది. మాస్టర్ కార్డ్ ఉన్నవారికి సెప్టెంబర్ 14 సాయంత్రం 6 గంటల నుంచే ఉంటాయి.