న్యూ జర్నీ స్టార్ట్ చేసిన టీమిండియా ఓపెనర్.. పెళ్లి ఫోటోలు వైరల్
మాజీ క్రికెటర్‌తో ఘనంగా రుతురాజ్ గైక్వాడ్ వివాహం
X
ధోని శిష్యుడు, టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ ఇంటివాడయ్యాడు. శనివారం తన చిరకాల స్నేహితురాలు, మహారాష్ట్ర మాజీ క్రికెటర్ ఉత్కర్ష పవార్‌ను రుతురాజ్ పెళ్లాడాడు. వీరిద్దరి వివాహం ముంబైలోని ఓ పంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను రుతురాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా వీరిద్దరూ తమ పెళ్లికి ముందు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ఇటీవలె ముగిసిన ఐపీఎల్ 2023లో రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శన చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ చాంపియన్ గా నిలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఫైనల్ ను ఉత్కర్ష ప్రత్యక్షంగా వీక్షించింది. వీరిద్దరు ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోలు కూడా దిగారు. వాస్తవానికి రుతురాజ్ గైక్వాడ్ ఇంగ్లండ్ కు వెళ్లాల్సి ఉంది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కోసం రుతురాజ్ ను స్టాండ్ బై ప్లేయర్ గా బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే పెళ్లి కారణంగా రుతురాజ్ గైక్వాడ్ బీసీసీఐ నుంచి మినహాయింపు కోరాడు. దాంతో స్టాండ్ బై ప్లేయర్స్ జాబితా నుంచి రుతురాజ్ ను తొలగించి అతడి స్థానంలో మరో యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ను ఎంపిక చేసింది.
కాగా రుతు మాదిరే ఉత్కర్ష కూడా క్రికెటర్. మహారాష్ట్రలోని పుణేకి చెందిన ఉత్కర్ష పవార్.. మహారాష్ట్ర తరఫున దేశవాలీ క్రికెట్ కూడా ఆడింది. 10 మ్యాచ్‌లు ఆడిన ఆమె 5 వికెట్ల పడగొట్టింది. క్రికెట్‌పై ఆసక్తితో ఉత్కర్ష 11 ఏళ్ల నుండే ఆడటం మొదలుపెట్టింది. ఇక ప్రస్తుతం ఆమె.. పుణెలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్‌నెస్ సైన్సెస్ విధ్యను అభ్యసిస్తున్నట్లు సమాచారం. కాగా రుత్‌రాజ్ గైక్వాడ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.