Home > క్రికెట్ > ‘ఇలాంటి ప్రయోగాలు ఇంకా ఎన్ని చేస్తారు’.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం

‘ఇలాంటి ప్రయోగాలు ఇంకా ఎన్ని చేస్తారు’.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం

‘ఇలాంటి ప్రయోగాలు ఇంకా ఎన్ని చేస్తారు’.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం
X

ఆసియా కప్2023కి టైం అయింది. ఆగస్టు 30 నుంచి మొదలయ్యే ఈ టోర్నీ కోసం బీసీసీఐ సోమవారం జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఎవ్వరూ ఊహించని విధంగా సంజూ శాంసన్ను పక్కనబెట్టి.. తిలక్ వర్మకు ఛాన్స్ ఇచ్చింది. అంతేకాకుండా చాలాకాలంగా గాయాలపాలై జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లకు జట్టులో స్థానం కల్పించింది. ఈ క్రమంలో సెలక్టర్లపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచులు ఆడనీయకుండా డైరెక్ట్ మెగా టోర్నీలో బరిలోకి ఎలా దించుతారని ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాహుల్, అయ్యర్ స్థానాలపై క్లారిటీ ఇచ్చాడు.





‘ఆసియా కప్ ఆడటానికి శ్రేయస్ పూర్తి ఫిట్గా ఉన్నాడు. కాకపోతే రాహుల్ను గాయం ఇంకా వెంటాడుతోంది. ఆసియా కప్లో టీమిండియా ఆడే రెండు లేదా మూడో మ్యాచ్కు అతను టీంలోకి రావచ్చు. అందుకే శాంసన్ను ట్రావెలింగ్ స్టాండ్ బై ప్లేయర్గా ఎంపిక చేశాం. రాహుల్ ఎట్టిపరిస్థితిలోనూ పాకిస్థాన్తో మ్యాచ్లో ఆడడు. మ్యాచ్ కన్నా ప్లేయర్ ఫిట్నెస్ మాకు ముఖ్యం’అని అజిత్ క్లారిటీ ఇచ్చాడు. అజిత్ మాటలుపై ఫ్యాన్స్ తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. పోయిన ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్లో ఫెయిల్ అయ్యాడని, బీసీసీఐ ఈసారి రిస్క్ తీసుకోవట్లేదు. అందుకే రాహుల్ను ఆడించడం లేదంటూ ట్రోల్ చేస్తున్నారు.






Updated : 21 Aug 2023 1:34 PM GMT
Tags:    
Next Story
Share it
Top