స్పిన్ ఉచ్చులో భారత్ విలవిల.. ఏ ఒక్కరు కూడా!
X
ప్చ్.. మనోళ్లకు మళ్లీ ఏదో అయింది. వరుస రెండు టెస్టుల్లో జోరుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్లేయర్లు ఇవాళ తేలిపోయారు. జైస్వాల్ (73) మినహా ఏ ఒక్కరు కూడా కనీసం 40 పరుగులు కూడా చేయలేకపోయారు. బ్యాటింగ్ పిచ్ లపై యధేశ్చగా పరుగులు చేసిన మన బ్యాటర్లు.. బౌలింగ్ పిచ్ లో ఎదురీదుతోంది. ఫలితం ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 219 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఇంకా 134 పరుగులు వెనుకబడి ఉంది. మన స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపని పిచ్ పై.. ఇంగ్లండ్ స్పిన్నర్లు షోయబ్ బషీర్ 4, టామ్ హార్ట్ 2 రెచ్చిపోయారు. ఇంగ్లీష్ స్పిన్నర్ల ధాటికి భారత బ్యాటర్లు విలవిల్లాడారు.
శుభ్‌మన్ గిల్ (38) ఫర్వాలేదనిపించాడు. రోహిత్ శర్మ (2), రజత్ పటీదార్ (17), రవీంద్ర జడేజా (12), సర్ఫరాజ్ ఖాన్ (14), రవిచంద్రన్ అశ్విన్ (1) విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో ధ్రువ్ జురేల్ (30*), కుల్దీప్ యాదవ్ (17*) ఉన్నారు. కాగా అంపైర్స్ కాల్ టీమిండియా కొంప ముంచింది. మంచి ఊపులో ఉన్న గిల్ అంపైర్స్ కాల్ వల్ల ఔట్ అయ్యాడు. బషీర్ వేసిన (24.1 ఓవర్) బంతిని ఆడే క్రమంలో గిల్ ప్యాడ్లను తాకింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీనిపై గిల్ డీఆర్ఎస్ రివ్యూ తీసుకోగా.. అంపైర్స్ కాల్ వచ్చింది. మరోవైపు రజత్ పటిదార్ కూడా ఇలానే ఔట్ అయ్యాడు. బషీర్ బౌలింగ్ లోనే (34.3 ఓవర్) ఎల్బీ ఔట్ అయ్యాడు. అది కూడా అంపైర్స్ కాల్ వల్లే. అశ్విన్ ను (55.2 ఓవర్) టామ్ హార్ట్లే ఎల్బీ ఔట్ చేశాడు. రివ్యూలో నాటౌట్ అని అర్థం అవుతున్నా.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో అశ్విన్ కూడా పెవిలియన్ చేరాడు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.