Home > క్రికెట్ > నిరాశపర్చిన ధోని బౌలర్..డెబ్యూ మ్యాచ్ లోనే 16 వైడ్లు..

నిరాశపర్చిన ధోని బౌలర్..డెబ్యూ మ్యాచ్ లోనే 16 వైడ్లు..

నిరాశపర్చిన ధోని బౌలర్..డెబ్యూ మ్యాచ్ లోనే 16 వైడ్లు..
X

ఐపీఎల్ 2023లో వెలుగులోకి వచ్చిన యంగ్ ప్లేయర్స్‌లో సీఎస్కే బౌలర్ పతిరానా ఒకడు. కెప్టెన్ ధోని సలహాలతో టోర్నీలో అద్భుతంగా రాణించాడు. డెత్ ఓవర్లలో భారీ హిట్టర్స్‌కు సైతం కళ్లెం వేసి తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. మలింగ శైలిలో బౌలింగ్ చేసే ఈ శ్రీలంక యంగ ప్లేయర్ ఐపీఎల్‌లో రాణించడం ద్వారా.. స్వదేశానికి ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం శ్రీలంక జాతీయ జట్టులో పతిరానా‎కు చోటుదక్కింది.అయితే భారీ అంచనాలతో బరిలోకి దిగిన పతిరానా మొదటి వన్డేలో తీవ్రంగా నిరాశపర్చాడు. ఆఫ్గాన్ బ్యాటర్లు..ఈ యువ బౌలర్‌ను ఓ ఆటాడేసుకున్నారు. మొత్తం 8.5 ఓవర్లు బౌలింగ్ వేసిన పతిరానా.. 66 పరుగులు సమర్పించుకున్నాడు. అంతే కాకుండా ఈ మ్యాచులో పతిరానా వైడ్ ల వర్షం కురిపించాడు. ఏకంగా 16 వైడ్లు వేసి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే శ్రీలంక విధించిన 269 పరుగుల లక్ష్యాన్ని మరో 19 బంతుల్లోనే మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది.

అద్భుతమైన టాలెంట్ ఉన్న పతిరానాకు ఎక్స్ ట్రాలు భారీగా ఇవ్వడం ఓ వీక్‌నెస్. ఐపీఎల్ 2023లోను అత్యధిక వైడ్స్ వేసి బౌలర్ పతిరానా కావడం గమనార్హం. అతడు టోర్నీలో మొత్తం 29 వైడ్ బాల్స్ వేశాడు. పతిరానా తర్వాత 27 వైడ్లతో సిరాజ్ రెండో స్థానంలో ఉన్నాడు.

Updated : 2 Jun 2023 9:41 PM IST
Tags:    
Next Story
Share it
Top