Home > క్రికెట్ > కొత్త రోల్‌ పోషించేందుకు సిద్ధమైన రాజమౌళి

కొత్త రోల్‌ పోషించేందుకు సిద్ధమైన రాజమౌళి

కొత్త రోల్‌ పోషించేందుకు సిద్ధమైన రాజమౌళి
X

తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి. తన ప్రతిభతో తెలుగు సినిమాను ఆస్కార్ దాకా తీసుకెళ్లాడు.అంతేకాకుండా ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఆయన కొత్త బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ సారి సినిమాకు సంబంధించినది కాదు..క్రికెట్కు సంబంధించిన బాధ్యతలను చేపట్టేందుకు రెడీ అయ్యారు.

దర్శకధీరుడు రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్‌ స్కూల్స్‌ బోర్డ్‌ ఫర్‌ క్రికెట్‌ గౌరవ అధ్యక్షుడిగా రాజమౌళి ఎన్నికయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటైన ISBC తమ గౌరవ అధ్యక్షుడిగా రాజమౌళిని ఎన్నుకుంది. ఈ సంస్థకు చీఫ్‌ ప్యాట్రన్‌గా బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ వ్యవహరిస్తుండగా.. వెటరన్‌ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కారు ప్రధాన సలహాదారుగా ఉన్నారు.

గతేడాది నెలకొల్పిన ISBC సంస్థ దేశవ్యాప్తంగా క్రికెట్‌ సంబంధించిన కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తోంది. ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ అవ‌కాశాలు, ప్రోత్సాహం లేక ఎదురు చూస్తున్న ఎంద‌రికో ఈ సంస్థ అండ‌గా నిలుస్తోంది. కాగా రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ మూవీ చేస్తున్నాడు. అడ్వెంచర్ థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ మూవీని స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

Updated : 1 July 2023 12:44 PM IST
Tags:    
Next Story
Share it
Top