Asia cup2023:టీమిండియాకు షాక్.. జట్టుకు దూరమైన కీలక ఆటగాడు
X
ఆసియా కప్2023 సమయం ఆసన్నమయింది. బుధవారం (ఆగస్ట్ 30)న ఆతిథ్య పాకిస్థాన్, నేపాల్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ ఆడే మ్యాచ్ లన్నీ శ్రీలంకలో జరుగనుండగా.. మంగళవారం (ఆగస్ట్ 29) టీమిండియా శ్రీలంకకు పయణం అయింది. టోర్నీకోసం బెంగళూరు సమీపంలోని అలూరులో క్యాంప్ ఏర్పాటు చేసుకుని టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పైనే అందరి దృష్టి ఉంది. ప్రాక్టీస్ సెషన్ లో శ్రేయస్ అయ్యర్ రాణించినప్పటికీ టీం మేనేజ్మెంట్ లో మాత్రం నమ్మకం కలగట్లేదు. ఇక కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకోలేదని తెలిసిందే. ఇంకా అతను గాయంతో బాధపడుతున్నాడు. దీంతో మొదటి మ్యాచ్ లకు రాహుల్ ను దూరం పెడుతున్నామని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.
కాగా, ఇవాళ అతనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీలంకకు వెళ్తున్న టీమిండియా.. కేఎల్ రాహుల్ ను భారత్ లోనే వదిలేసి వెళ్లింది. రాహుల్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా వారం రోజులు పడుతుందని ఫిజియో చెప్పగా.. బీసీసీఐ ఈ పనిచేసింది. రాహుల్ ప్రస్తుతం ఫిట్ నెస్ సాధించడానికి కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో 100శాతం కోలుకోకపోతే.. ఆసియా కప్ నుంచి తప్పిస్తారు. దీంతో రాహుల్ వరల్డ్ కప్ ఆశలు కూడా వదులుకోవాల్సిందే. రాహుల్ భవిశ్యత్తును దృష్టిలో పెట్టుకుని పలువురు ఎక్స్ పర్ట్స్ సూచనలు చేశారు. రాహుల్ కు తుది జట్టులో చోటు కల్పించకూడదని సలహాలిచ్చారు. ప్రాక్టీస్, ఫిట్ గా లేని ఆటగాళ్లను ఆడించి మరోసారి ఫెయిల్ కావొద్దని సూచిస్తున్నారు. ప్రయోగాలు పక్కనపెట్టి ఈసారైనా సరైన టీంను ఆడించాలని కోరుతున్నారు. సంజూ శాంసన్, ఇషార్ కిషన్ లలో ఒకరిని ఎంపిక చేసి ఆడిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.