Home > క్రికెట్ > ఫైనల్లో చేతులెత్తేసిన టీమిండియా.. విశ్వ విజేత ఆస్ట్రేలియా

ఫైనల్లో చేతులెత్తేసిన టీమిండియా.. విశ్వ విజేత ఆస్ట్రేలియా

ఫైనల్లో చేతులెత్తేసిన టీమిండియా.. విశ్వ విజేత ఆస్ట్రేలియా
X

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ పై ఆస్ట్రేలియా.. 209 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ డిక్లేర్ చేసిన 444 పరుగుల లక్ష్యాన్ని చేదించలేని టీమిండియా.. 234 రన్స్ కే ఆలౌట్ అయింది. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన భారత్.. కప్పు అందుకోలేకపోయింది. దాంతో 12 సంవత్సరాల నిరీక్షణకు రోహిత్ సేన నీళ్లు చల్లింది. కీలక పోరులో మరోసారి అన్ని రంగాల్లో విఫలమై.. ఓటమి పాలయింది. రికార్డ్ ఛేజింగ్ లో ఆశలు రేపిన కోహ్లీ, రహానే వికెట్లు పడటంతో.. భారత్ పతనం ప్రారంభం అయింది.




444 పరుగుల టార్గెట్ తో 164/ 3తో చివరి రోజు ఆట మొదలు పెట్టిన భారత్.. ఆసీస్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. టీమిండియా బ్యాటర్లలో కోహ్లీ 49, రహానే 46, రోహిత్ 43, పుజారా 27, భరత్ 23, గిల్ 18 రన్స్ చేశారు. జడేజా, శార్దూల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్ 3, లియోన్ 4, స్టార్క్ 2 వికెట్లు, కమిన్స్ 1 వికెట్ పడగొట్టారు.

ఘోరంగా విఫలమైన బ్యాటర్లు:

ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో తడబడిన బ్యాట్స్మెన్స్.. కీలకమైన రెండో ఇన్నింగ్స్ లోనూ పట్టు సాధించలేకపోయారు. ఆసీస్ బ్యాట్స్ మెన్ రెచ్చిపోయిన పిచ్ పై.. భారత్ బ్యాటర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. దీంతో భారీ లక్ష్యం ముందు టీమిండియా బోల్తా పడింది. కోహ్లి, రహానె, రోహిత్ తప్ప మిగతా వాళ్లెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఈ పరాభవంతో భారత బ్యాటర్లపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.







Updated : 11 Jun 2023 12:22 PM GMT
Tags:    
Next Story
Share it
Top