Home > క్రికెట్ > 48 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన భారత స్పిన్నర్లు

48 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన భారత స్పిన్నర్లు

48 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన భారత స్పిన్నర్లు
X

ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 218 పరుగులకే ఇంగ్లాండ్ ను భారత్ ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ శుభారంభాన్ని ఇచ్చారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 1 వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్ లో టీమిండియా స్పిన్నర్లు 48 ఏండ్ల రికార్డును బ్రేక్ చేశారు. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటర్ల నడ్డి విరిచాడు. మరో వైపు అశ్విన్ 4 వికెట్లు తీసి శభాష్ అనిపించుకున్నాడు. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా మరో వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు స్పిన్నర్లే తీయడంతో..48 ఏళ్ల అరుదైన రికార్డు బ్రేక్ అయ్యింది.

48 ఏళ్ల చరిత్రలో భారత స్పిన్నర్లు టెస్టు మ్యాచ్ మొదటి రోజున మొత్తం 10 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. గతంలో 1976లో ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించారు. అంతేగాక ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన కుల్దీప్ టెస్టుల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.

Updated : 8 March 2024 8:16 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top