IND vs AUS: ఆసక్తిగా రెండో టీ20.. మ్యాచ్‌కు వాన ముప్పు
X
వరల్డ్ కప్ ఓటమిని మర్చిపోయేలా.. ఆ బాధ నుంచి బయటపడేలా.. టీ20 వరల్డ్ కప్ ప్రాక్టీస్ ను ఘనంగా ప్రారంభించింది టీమిండియా. వరల్డ్ కప్ తర్వాత ఆడిన తొలి పోరులో.. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ నాయకత్వంలో ఆస్ట్రేలియాపై రికార్డు విక్టరీ సాధించింది. కాగా ఇవాళ తిరువనంతపురంలో జరిగే రెండో టీ20 మ్యాచ్ లో అదే జోరు కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. విశాఖలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఆసీస్ ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే రెండో టీ20లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. టీమిండియా బ్యాటింగ్ దళం బలంగానే ఉన్నా.. బౌలింగ్ సమస్య కలవరపెడుతుంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ యంగ్ బౌలర్లపై ఫోకస్ పెట్టింది. విశాఖలో పేసర్ ముకేశ్ కుమార్ తప్ప మిగతా బౌలర్లంతా ఎక్కువ రన్స్ ఇచ్చుకున్నారు.
ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుకునే అవకాశం కనిపిస్తుంది. శనివారం తిరువనంతపురంలో చినుకులు పడటంతో పిచ్‌ను కవర్లతో కప్పిఉంచారు. ఆదివారం మ్యాచ్ సమయానికి కూడా వర్షం సూచన ఉంది. ఈ స్టేడియంలో ఇప్పటిదాకా మూడే మ్యాచ్‌లు జరిగాయి. అందులో ఒక మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించగా.. మిగతా రెండింటిలో ఛేజింగ్ టీమ్స్ గెలిచాయి. ఈ వికెట్‌పై ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. కాబట్టి టాస్ నెగ్గిన జట్టు ఛేజింగ్‌కు మొగ్గు చూపొచ్చు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.