Asia Cup 2023: విజయ్ దేవరకొండ స్పెషల్ షో.. తిలక్ వర్మను పొగుడుతూ..
X
ఆసియా కప్2023 సమరం మొదలయింది. తొలి మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్తాన్, నేపాల్ తలపడుతున్నాయి. కాగా, ప్రపంచమంతా సెప్టెంబర్ 2 జరగబోయే ఇండియా, పాకిస్తాన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు.. ప్రేక్షకులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండను కామెంటర్ గా తీసుకొస్తోంది. దానికోసం స్పెషల్ షోను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అందులో మాట్లాడిన విజయ్..
‘మీ అందరిలాగానే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసం నేను కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. ప్రతీ మ్యాచ్ ను తప్పకుండా చూస్తా. ఈ టోర్నీలో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మకు చోటు దక్కడం చాలా సంతోషంగా ఉంది. మా అందరి సపోర్ట్ అందుకుని రాణించాలని కోరుకుంటున్నా. నా అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లీ ఎప్పటిలానే అదరగొట్టాలి. కప్పును తీసుకురావాలి. ప్రత్యర్థులను ఎదురించి నిలబడే ఆయన సత్తా నచ్చుతుంది. చివరి సారిగా 2021 టీ20 వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ లో చూశా. ఆ ఇప్పుడు కామెంటర్ గా రావడం ఆనందంగా ఉంది’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు.