Home > క్రికెట్ > చెలరేగిన భారత్ బౌలర్లు...కుప్పకూలిన విండీస్..

చెలరేగిన భారత్ బౌలర్లు...కుప్పకూలిన విండీస్..

చెలరేగిన భారత్ బౌలర్లు...కుప్పకూలిన విండీస్..
X

బార్బడోస్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ స్పిన్నర్లు విజృంభించారు. కుల్దీప్ యాదవ్ 4/6, రవీంద్ర జడేజా 3/37, చెలరేగడంతో విండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. హార్దిక్‌, ముకేశ్‌, శార్దూల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్‌ హోప్‌(43) టాప్ స్కోరర్.

ముందుగా టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయం సరైనదే అని భారత్ బౌలర్లు ఆరంభలోనే రుజువు చేశారు. కైల్ మేయర్స్‎ను ఔట్ చేసి భారత్‌కు మొదటి వికెట్‌ను హార్దిక్ పాండ్యా అందించాడు. తర్వాత కాసేపు అథనేజ్, కింగ్‌‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీలు చిక్కినప్పుడు బౌండరీలు సాధించి స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. ఈక్రమంలోనే అథనేజ్‌ను ముకేష్ కుమార్ 8వ ఓవర్‌లో ఔట్ చేయడంతో వెస్టిండీస్ 45 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. తర్వాత ఓవర్లోనే బి. కింగ్‌ శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో విండీస్ 45 పరుగుల వద్దే 3 వికెట్ కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. తర్వాత కాసేపు హోప్, హెట్‌మయేర్‌ నిలకడగా ఆడారు. జడేజా వేసిన 16వ ఓవర్‌లో నాలుగో బంతికి హెట్‌మయేర్‌(11) బౌల్డ్‌ కావడంతో విండీస్ పరిస్థితి మారిపోయింది. ఇక అక్కడినుంచి వరుస వికెట్లను కోల్పోయింది. ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్‌ హోప్‌ 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. టెయిలండర్లను కుల్దీప్ త్వరగా ఔట్ చేయడంతో విండీస్ ఇన్సింగ్స్ త్వరగానే ముగిసింది.

Updated : 27 July 2023 10:17 PM IST
Tags:    
Next Story
Share it
Top