Home > క్రికెట్ > టాస్ గెలిచిన వెస్టిండీస్..భారత్ జట్టులో యువ ఓపెనర్

టాస్ గెలిచిన వెస్టిండీస్..భారత్ జట్టులో యువ ఓపెనర్

టాస్ గెలిచిన వెస్టిండీస్..భారత్ జట్టులో యువ ఓపెనర్
X

ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భాగంగా కీలకమైన మూడో మ్యాచ్ లో తలపడేందుకు వెస్టిండీస్, భారత్ సిద్దమయ్యాయి. టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసుగా రెండు టీ20ల్లో ఓటమి చవిచూసిన టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ ద్వారా యశస్వీ జైశ్వాల్ టీ20లో ఆరంగ్రేటం చేయనున్నాడు. ఇషాన్ కిషన్ స్థానంలో జైశ్వాల్ తుది జట్టులోకి వచ్చాడు. రెండో టీ20కి దూరమైన కుల్దీప్ యాదవ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. వెస్టిండీస్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. టీమిండియా సిరీస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలి. తిలక్ వర్మ తప్ప మిగిలన ఆటగాళ్లెవరూ ఫామ్ లో లేకపోవడం భారత్ ను కలవరపెడుతోంది.





తుది జట్లు

భారత్ జట్టు : శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(సి), సంజు శాంసన్(w), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్

వెస్టిండీస్ జట్టు: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్(w), రోవ్‌మన్ పావెల్(c), షిమ్రాన్ హెట్మెయర్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్


Updated : 8 Aug 2023 7:51 PM IST
Tags:    
Next Story
Share it
Top