Home > క్రికెట్ > WTC ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే విన్నర్ ఎవరు...?

WTC ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే విన్నర్ ఎవరు...?

WTC ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే విన్నర్ ఎవరు...?
X

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు రంగం సిద్ధం అయింది. జూన్ 7న ఇంగ్లండ్ లోని ఓవల్ స్టేడియంలో తుది మ్యాచ్ జరుగనుంది. తొలి ఎడిషన్ ఛాంపియన్ షిప్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా.. ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తుంది. అయితే.. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయంగా మారే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో వర్షం కారణంగా ఫైనల్‌ మ్యాచ్ డ్రా అయితే.. ఫలితం ఎలా ఉంటుందన్న ప్రశ్న ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ లో మెదులుతోంది.

ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయినా లేదా టైగా ముగిసినా.. ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు. రెండు జట్లు ట్రోఫీని షేర్ చేసుకుంటాయి. ఒకవేళ 5 రోజుల ఆటలో ఎప్పుడైనా వర్షం పడ్డా.. లేదా ఇతర వాతావరణ పరిస్థితుల వల్ల మ్యాచ్ కు ఎక్కువసేపు అంతరాయం కలిగినా.. రిజర్వ్ డే ఉంటుంది. రిజర్వ్ డే రోజు కూడా ఆట జరగకపోతే ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.

వరల్డ్ వెదర్ లైన్ ప్రకారం.. జూన్ 7 నుంచి 11 వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకవేళ మొదటి మూడు రోజులు అంటే.. జూన్ 7 నుంచి 9 వరకు తేలికపాటి, 10, 11 తేదీల్లో ఎక్కువ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అయితే, ఈ ఫైనల్ కు జూన్ 12 రిజర్వ్ డేగా ఉంది. వర్షం కారణంగా ఒక రోజు ఆడకపోయినా.. లేదా మ్యాచ్ కు అంతరాయం కలిగినా.. రిజర్వ్ డేని వాడుకుంటారు.

Updated : 5 Jun 2023 5:17 PM GMT
Tags:    
Next Story
Share it
Top