Home > క్రికెట్ > ఫ్యాన్స్ ట్రోలింగ్... విరాట్ కోహ్లీ స్పందన

ఫ్యాన్స్ ట్రోలింగ్... విరాట్ కోహ్లీ స్పందన

ఫ్యాన్స్ ట్రోలింగ్...  విరాట్ కోహ్లీ స్పందన
X

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో పడింది. రెండు రోజుల ఆటముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించడంతో భారత్ టాప్ ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు. రోహిత్ 15, గిల్ 13, పుజారా 14, విరాట్ కోహ్లీ 14 పరుగులు మాత్రమే చేశారు. కీలక మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్లు తక్కువ పరుగులకే వెనుదిరగడంతో భారత్ ఆటగాళ్లు తీవ్ర నిరాశ చెందారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలు పెట్టారు.

స్టార్క్ బౌలింగ్‌లో విరాట్ ఔట్ కాగానే వెళ్లి డకౌట్‌లో భోజనం చేస్తూ కనిపించాడు. ఫుడ్ తింటూ ఇషాన్ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌తో మాట్లాడుతున్నాడు. ఇందుకు సంబంధించిన పిక్‌ను నెటిజన్లు షేర్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు. ఓ నెటిజన్ కోహ్లీ తీరును తప్పుబడుతూ ట్వీట్ చేశాడు. " 2003 ప్రపంచకప్‎లో సచిన్ త్వరగా అవుటయ్యాడు. ఆ బాధతో మూడు రోజుల వరకు ఆహారం ముట్టలేదు. కానీ, కోహ్లీ మాత్రం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ 2023లో అవుటైన వెంటనే తింటున్నాడు’’ అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు.

అది వైరల్ గా మారింది. దీనిపై విరాట్ తనదైనశైలిలో స్పందించాడు. ‘‘ఇతరుల అభిప్రాయాల చెరసాల నుంచి నిన్ను నీవు విముక్తి పొందేందుకు అయిష్టమనే సామర్థ్యాన్ని నీవు తప్పకుండా అభివృద్ధి చేసుకోవాలి’’ అని ఇన్‎స్టాలో కోహ్లీ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం విరాట్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

మరోవైపు విరాట్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది.సోషల్ మీడియా వేదికగా.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మొదట రోహిత్ ఔట్ కాగానే...విరాట్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తే..విరాట్ ఔట్ అయ్యాక రోహిత్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు.

Updated : 9 Jun 2023 4:19 PM IST
Tags:    
Next Story
Share it
Top