Home > క్రికెట్ > ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్.. భారత బ్యాట్స్మెన్ బోల్తా.. ఆధారాలివిగో

ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్.. భారత బ్యాట్స్మెన్ బోల్తా.. ఆధారాలివిగో

ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్.. భారత బ్యాట్స్మెన్ బోల్తా.. ఆధారాలివిగో
X

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ సంచలన ఆరోపణలు చేశారు. మొదటి ఇన్నింగ్స్ టైంలో ఆసీస్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిందని.. దానివల్లే గిల్, పుజారా, విరాట్ కోహ్లీ వికెట్లు ఊహించని రీతిలో పడ్డాయని ఆరోపించారు. అయితే, దీన్ని అంపైర్లు, కామెంటేటర్లు ఎవరూ గుర్తించకపోవడం దురదృష్టకరమని అన్నారు. బాల్ ట్యాంపరింగ్ జరిగింది అనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని బాసిత్ అన్నారు.

‘గిల్, పుజారా, కోహ్లీ ట్యాంపరింగ్ చేయడం వల్లే అనూహ్యంగా ఔటయ్యారు. వాళ్ల బ్యాటింగ్ టైంలో బాల్ లోపలికి దూసుకొచ్చింది. జడేజా ఔట్ అయినప్పుడు కూడా ఆసీస్ ప్లేయర్లు ఇలాగే చేశారు’ అని ఆరోపించారు. మ్యాచ్ లో ఆడిన డ్యూక్స్ బాల్.. 40 ఓవర్ల వరకు రివర్స్ స్వింగ్ కాదు. కానీ, ఈ మ్యాచ్ లో ఆసీస్ బౌలర్లు 15 ఓవర్ నుంచే రివర్స్ స్వింగ్ చేసి చూపించారు. బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతి షైన్ కోల్పోయిన విషయం క్లీయర్ గా కనిపిస్తుంది. దాన్ని అంపైర్లు ఎందుకు గుర్తించలేకపోయారు. బహుశా వాళ్లకు కళ్లు కనిపించట్లేదేమో అని మండి పడ్డారు.




Updated : 10 Jun 2023 7:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top