డీడీ స్పోర్ట్స్‌లో WTC ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం
X
WTC ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టైటిల్ పోరు డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. ఈ మేరకు దూరదర్శన్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. 2021-23 ఫైనల్ మ్యాచ్‌ను డీడీ స్పోర్ట్స్ (డీడీ ఫ్రీ డిష్) ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది.
WTC ఫైనల్ మ్యాచ్ ఓవల్ వేదికగా జూన్ 7-12 మధ్యలో జరగనుంది. ఇప్పటికే లండన్ చేరుకున్న ఇరుజట్లు కఠోర సాధన చేస్తున్నాయి. ఆసీస్-భారత్ టీంలు పటిష్టంగా కనిపించడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. వరుసుగా రెండో సారి ఫైనల్‌కు చేరిన భారత్ టైటిల్‌ను నెగ్గాలనే పట్టుదలతో ఉంది.గాయాలు కారణంగా టీం ఇండియా కీలక ఆటగాళ్లు బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ లు తుది పోరుకు దూరమయ్యారు. రోహిత్ శర్మ,శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానేలతో భారత్ బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్‌లో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్,రవీంద్ర జడేజా,అశ్విన్ కీలకం కానున్నారు. వికెట్ కీపర్ విషయంలో శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్ మధ్య పోటీ ఉండగా...ఇషాన్ కిషన్‌కే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
జట్టు వివరాలు
టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్
అస్ట్రేలియా: మార్కస్ హ్యారిస్, ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, నాథన్ లియోన్