Home > క్రైమ్ > బ్రిడ్జిపై నుంచి నదిలో పడిన పెళ్లిబృందం ట్రక్కు ..

బ్రిడ్జిపై నుంచి నదిలో పడిన పెళ్లిబృందం ట్రక్కు ..

బ్రిడ్జిపై నుంచి నదిలో పడిన పెళ్లిబృందం ట్రక్కు ..

బ్రిడ్జిపై నుంచి నదిలో పడిన పెళ్లిబృందం ట్రక్కు ..
X


మధ్యప్రదేశ్​లోని దతియాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ వేడుకకు వెళ్తున్న ఓ మినీ ట్రక్కు ప్రమాదవ శాత్తు నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరో 30కి పైగా మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం తరువాత ట్రక్కులో ప్రయాణిస్తున్న పిల్లలు కొందరు తప్పిపోయినట్లు తెలుస్తోంది. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి

గ్వాలియర్‌లోని బిల్​హెటి గ్రామానికి చెందిన ప్రజలు.. టికంగఢ్​లో జరిగిన ఓ వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ట్రక్కు బుహ్రా నదిలో పడిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే సమీప గ్రామస్తులు ట్రక్కులోని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. జిల్లా యంత్రాంగం, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నదిలో పడినవారిలో కొందరు చిన్నారులు కనిపించకుండా పోయారు. వారికోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.

రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మినీ ట్రక్ ప్రమాదానికి గురైన సమయంలో 50 మంది ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.




Updated : 28 Jun 2023 1:38 PM IST
Tags:    
Next Story
Share it
Top