Home > క్రైమ్ > ప్రేమకు అడ్డంగా ఉందని తల్లినే కడతేర్చిన కూతురు

ప్రేమకు అడ్డంగా ఉందని తల్లినే కడతేర్చిన కూతురు

ప్రేమకు అడ్డంగా ఉందని తల్లినే కడతేర్చిన కూతురు
X

ఉత్తర్‎ప్రదేశ్‎లో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరిస్తోందని కూతురే ప్లాన్ వేసి మరీ ప్రియుడితో కలిసి కని పెంచిన సొంత తల్లినే కడతేర్చింది. ప్రియుడి సూచన మేరకు తల్లిని బయటకు రప్పించి అత్యంత దారుణంగా హతమార్చింది. తమ ప్రేమకు అడ్డు చెబుతున్న ప్రియురాలి తల్లి అడ్డును తొలగించుకునేందుకు పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు ప్రియుడు. దీంతో ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఆగ్రాలోని భావనా అరోమా హౌసింగ్‌ సొసైటీలో నివాసముంటున్నారు ఉదిత్ బజాజ్, అంజలి బజాజ్ దంపతులు. ఉదిత్ ఓ ఫుట్‎వేర్ వ్యాపారి. వీరిద్దరికీ ఓ మైనర్ కూతురు ఉంది. అయితే తన కూతురు తనకంటే వయసులో పెద్దవాడైన ప్రాకర్ గుప్తను ప్రేమించడం అంజలికి నచ్చలేదు. దీంతో వారిద్దరి ప్రేమకు గత కొంత కాలంగా అడ్డుగా నిలుస్తోంది. దీంతో తమ ప్రేమకు అడ్డుగా నిలుస్తోందని తల్లి అడ్డును తొలగించుకోవాలని ప్లాన్ వేసింది కూతురు. తల్లిని తెలివిగా శివాలయానికి రప్పించింది కూతురు. ఆమెతో పాటే వచ్చిన తండ్రికి ఫోను చేసి అతను వేరేచోటుకు వెళ్లేలా ప్లాన్ చేసింది. వెంటనే ప్రాకర్‌ అక్కడకు వచ్చి ఆమెను పక్కకు తీసుకెళ్లి పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి చంపేశాడు. కాసేపటికి తిరిగి వచ్చిన ఉదిత్‌కు అక్కడ భార్య కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుడి సమీపంలో అంజలి మృతదేహాన్ని గుర్తించారు. ఆమె హత్యకు గురైందని నిర్ధారించారు. అంతే కాదు ఈ హత్య వెనుక మృతురాలి కూతురు, ఆమె ప్రియుడి హస్తం ఉందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పోలీసులు నిందితుల కోసం అన్వేషిస్తున్నారు.



Updated : 10 Jun 2023 9:56 AM IST
Tags:    
Next Story
Share it
Top