Home > క్రైమ్ > మరో విషాదం.. కుక్కల దాడిలో 18 నెలల బాలుడు మృతి..

మరో విషాదం.. కుక్కల దాడిలో 18 నెలల బాలుడు మృతి..

మరో విషాదం.. కుక్కల దాడిలో 18 నెలల బాలుడు మృతి..
X

తెలంగాణలో వీధి కుక్కల వీర విహారం కొనసాగుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు దాడులకు తెగబడుతున్నాయి. కుక్కల దాడుల్లో ఇప్పటికే పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో పసిప్రాణం కుక్కల దాడికి బలైంది. 18 నెలల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయగా.. చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

వరంగల్ జిల్లా కొత్తపల్లిలో జూన్ 17న వీధికుక్కలు ఓ ఇంట్లోకి చొరబడి ఆడుకుంటున్న పిల్లలపై దాడి చేశాయి. ఈ దాడిలో రాజు అనే 18 నెలల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలిచి చికిత్స అందజేశారు. 25 రోజులుగా ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు రాజు.. మృత్యువుతో పోరాడి ప్రాణం వదిలాడు. చిన్నారి మృతితో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.

Updated : 12 July 2023 8:08 PM IST
Tags:    
Next Story
Share it
Top