ఇద్దరి మహిళల ప్రాణాలు తీసిన 10వేల అప్పు
X
అన్న 10 వేల అప్పుకు ఇద్దరు అక్కాచెల్లెల్ల బలయ్యారు. అన్న ప్రాణాలు కాపాడబోయి వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఢిల్లీలో జరిగింది. ఆర్కే పురం అంబేద్కర్ బస్తీకి చెందిన లలిత్ అనే వ్యక్తి గతంలో దేవ్ అనే వ్యక్తికి 10వేల అప్పు ఇచ్చాడు. తాను ఇచ్చిన అప్పు మొత్తం తిరిగి చెల్లించాల్సిందిగా ఆ వ్యక్తిని కోరాడు. ఈ క్రమంలో దేవ్.. మరికొందరితో కలిసి శనివారం లలిత్‌తో గొడవకు దిగారు.
ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు అందరూ నిద్రిస్తున్న సమయంలో దేవ్ మరో 20 మందితో కలిసి లలిత్ ఇంటిపై దాడికి దిగాడు. అతడి ఇంటిపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన లలిత్ సోదరీమణులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పింకీ, జ్యోతి అనే మహిళలు మరణించారు. ఓ బుల్లెట్ లలిత్కు కూడా తగలడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అరుణ్, మిషెల్, దేవ్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీసీపీ మనోజ్ తెలిపారు.
ఈ ఘటన రాజకీయ దుమారానిక తెరదీసింది. ఢిల్లీలో ప్రజల భద్రతపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘బాధిత మహిళల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఢిల్లీ వాసుల్లో అభద్రతా భావం పెరిగిపోయింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన వారు.. ఆ పనిని వదిలేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చే పనిలో బిజీ ఉన్నారు. ఆప్ ప్రభుత్వం చేతిలో శాంతిభద్రతలు ఉండి ఉంటే.. ఢిల్లీ మరింత భద్రంగా ఉండేది’’ అని అన్నారు.
दोनों महिलाओं के परिवारों के साथ हमारी संवेदनायें। भगवान उनकी आत्मा को शांति दें।
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 18, 2023
दिल्ली के लोग अपने आप को बहुत असुरक्षित महसूस करने लगे हैं। जिन लोगों को दिल्ली की क़ानून व्यवस्था सँभालनी है, वो क़ानून व्यवस्था ठीक करने के बजाय पूरी दिल्ली सरकार पर क़ब्ज़ा करने के षड्यंत्र कर… https://t.co/PxT6A2KnkK