Home > క్రైమ్ > పాక్‎లో హిందూ బాలికల కిడ్నాప్..మతం మార్చి..

పాక్‎లో హిందూ బాలికల కిడ్నాప్..మతం మార్చి..

పాక్‎లో హిందూ బాలికల కిడ్నాప్..మతం మార్చి..
X

పాకిస్తాన్‎లో హిందువుల పరిస్థితి దయనీయంగా మారింది. పాక్‎లో మైనారిటీలుగా ఉన్న హిందువులు, సిక్కులు , క్రైస్తవులపై నిత్యం దాడులు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా అక్కడివారు హిందువులను టార్గెట్ చేశారు. హిందూ బాలికలను బలవంతంగా అపహరించి వారి మతాన్ని మార్చి ముస్లిం వ్యక్తులకు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. ఈ దారుణమైన సంఘటనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా సింధ్ ప్రావిన్స్‎‎కు చెందిన ఓ వ్యాపారి కూతుళ్లను అక్కడి ముస్లింలు ఎత్తుకెళ్లి వారి మతం మార్చి మరీ పెళ్లి చేసుకోవడంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

పాకిస్తాన్‎లో ముగ్గురు హిందూ బాలికల కిడ్నాప్ కలకలం రేపింది. సింధ్ ప్రావిన్స్‎లోని ధార్కి ప్రాంతానికి చెందిన ఓ హిందూ వ్యాపారి కూతుళ్లను అపహరించి, ఆపై బలవంతంగా వారి మతం మార్చి ముగ్గురు యువకులు వారిని వివాహం చేసుకున్నారు. పాక్‎ దరేవార్ ఇతేహాత్ సంస్థ చీఫ్ శివ కచ్చి ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. హిందూ వ్యాపారి లీలా రామ్ ముగ్గురు కూతుళ్లు చాందిని, రోష్ని, పరమేశ్ కుమారీలను కొంత మంది దుండగులు అపహరించారు. వారిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు. అనంతరం కిడ్నాప్ చేసిన ముగ్గురు ముస్లింలే వారిని పెళ్లి చేసుకున్నారని శివ కచ్చి తెలిపారు.

కచ్చి మీడియాతో మాట్లాడుతూ..." ఆన్‌లైన్ గేమ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఓ హిందువును ప్రేమించి భారత్‎కు వచ్చి అతడితో నివసిస్తున్న సీమా హైదర్ ఘటన అనంతరం నదీతీర ప్రాంతాల్లో నివసిస్తున్న హిందూ సమాజంపై ఈ మధ్యకాలంలో దాడులు పెరిగాయి. సాంప్రదాయిక ముస్లిం దేశం సామాజిక నిబంధనలను ధిక్కరించే ధైర్యం చేసినందుకు గాను ఇప్పటికే ఆమె కుటుంబాన్ని బహిష్కరించారు. ఇదిలా ఉండగా నదీతీర ప్రాంతాల్లో నివసిస్తున్న హిందువులపై ప్రతీకారం తీర్చుకుంటామని దొంగలు ప్రతి రోజూ అక్కడి ప్రజలను బెదిరిస్తున్నారు. గత వారం, సింధ్ ప్రావిన్స్‌లోని కాష్మోర్ ప్రాంతంలోని హిందువుల ఇళ్లతో పాటు హిందూ దేవాలయంపై రాకెట్ లాంచర్‌లతో దొంగల ముఠా దాడి చేసింది. కాష్మోర్‌లోని భాగ్రీ దేవాలయంపై దొంగలు దాడి తర్వాత, అధికారులు అప్రమత్తమయ్యారు. మిర్‌పుర్‌ఖాస్, కాష్మోర్, థార్‌పార్కర్, ఘోట్కీ, సుక్కూర్, ఉమర్‌కోట్ సంఘర్‌లలోని దేవాలయాలు, ప్రార్థనా స్థలాల భద్రత కోసం హిందూ పోలీసులను పంపించారు. పేద హిందూ ప్రజలు , హిందూ ప్రార్థనా స్థలాలకు భద్రత కల్పించాలని అధికారులు ఇప్పుడు కోరుతున్నారు" అని కచ్చి తెలిపారు.

Updated : 22 July 2023 3:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top