Home > క్రైమ్ > పులుల కేసులో వీడిన మిస్టరీ.. ముగ్గురు అరెస్ట్

పులుల కేసులో వీడిన మిస్టరీ.. ముగ్గురు అరెస్ట్

పులుల కేసులో వీడిన మిస్టరీ.. ముగ్గురు అరెస్ట్
X

అదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ అడవిలో రెండు పులుల మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విషప్రయోగం వల్లే రెండు పులులు చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో పదేళ్ల బాలుడు సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఆవును చంపి.. దాన్ని కళేబరంపై విషం చల్లారు. ఈ కళేబరాన్ని తిన్న పులులు అక్కడికక్కడే మరణించాయి. సదరు వ్యక్తుల కళ్లముందే వారి పశువులను పులులు తిన్నాయి. దీంతో పులిని ఎలాగైన మట్టుబెట్టాలనుకుని.. విష ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల దరిగాం అటవీ ప్రాంతంలో ఎస్ 15, ఎస్ 9 పులులు చనిపోయాయి. మొదట ఎస్ 15 పులి ఇంకో పులితో పోరాడి చనిపోయినట్లు అధికారులు చెప్పారు. అయితే అది కూడా విష ప్రయోగంతోనే చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం ఆరు పులులు ఉండగా.. రెండు చనిపోయాయి. మిగితావాటిలో మూడు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించగా.. ఇంకోటీ ఏమైందనేది మిస్టరీగా మారింది. ఇప్పటికే నిందితులను అడవిలోకి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్లు తెలుస్తోంది.


Updated : 12 Jan 2024 3:52 PM GMT
Tags:    
Next Story
Share it
Top