Video Viral : టీ తాగేందుకు వెళ్లిన పోలీసులు.. తప్పించుకున్న ఖైదీలు
X
పోలీసుల నిర్లక్ష్యం కారణంగా రిమాండ్‌లో ఉన్న ఖైదీలు తప్పించుకున్నారు. ఖైదీలను కోర్టులో హాజరుపరిచేందుకు వ్యాన్‌లొ తీసుకెళుతండగా.. పోలీసులకు దారిలో టీ తాగాలనిపించింది. ఒక చోట వ్యాన్‌ను నిలిపి టీ తాగేందుకు వెళ్లారు. కరెక్ట్ టైం దొరికిందని వ్యాన్ లో ఉన్న ఖైదీల్లో ముగ్గురు తప్పించుకుని పారిపోయారు. దీంతో సంబంధిత అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ సంఘటన జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రైల్వే స్టేషన్ లో మొబైల్ ఫోన్లు, పర్సులు, ఇతర విలువైన వస్తువులను కొట్టేస్తున్న ఏడు మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఖైదీలను ఝాన్సీ రైల్వే కోర్టుకు వ్యాన్ లో తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఖైదీలను తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో ఓ ప్రాంతంలో వ్యాన్ ను రోడ్డు పక్కను నిలిపి ఉంచి టీ తాగేందుకు పోలీసులు వెళ్లారు. దీంతో వ్యాన్ వద్ద గస్తీ పోలీసులు ఎవరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన ముగ్గురు ఖైదీలు వ్యాన్ నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయారు.ఖైదీలు వ్యాన్ నుంచి పరార్ అవుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా పారిపోయిన రిమాండ్ ఖైదీలను 27 ఏళ్ల బ్రిజేంద్ర, 20 ఏళ్ల శైలేంద్ర, 23 ఏళ్ల జ్ఞానప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు.
झांसी में तीन कैदी पुलिस वैन से फरार@Uppolice @jhansipolice pic.twitter.com/kq4n74zzfk
— Anmol dubey ( अनमोल दुबे ) (@anmoldubey110) September 21, 2023
తప్పించుకుపోయిన ఖైదీలకోసం పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహించి ఖైదీలు పారిపోవడానికి కారణమైన ముగ్గురు ఎస్సైలతో పాటు, ఎనిమిది మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇలా టీ తాగడానికి వెళ్లిన పోలీసులకు ఖైదీలు ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో చివరకు వారి ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.