Gold : గోల్డ్ స్మగ్లింగ్కు ఖతర్నాక్ ప్లాన్.. చివరకు ఏమైందంటే..!
X
బంగారం అక్రమ రవాణా కోసం స్మగ్లర్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఎయిర్ పోర్టులో పట్టుబడకుండా ఉండేందుకు సరికొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. అయితే విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన తనిఖీ వ్యవస్థ ఉండటంతో చివరకు పట్టుబడుతున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.
శుక్రవారం ఉదయం దుబాయ్ నుంచి ఓ వ్యక్తి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. కస్టమ్స్ అధికారులు ఆయన లగేజీ చెక్ చేయగా ఓ చీర కనిపించింది. అది అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు ఆ చీరను విప్పి చూశారు. దీంతో వారి అనుమానం నిజమైంది. సదరు ప్రయాణికుడు ఆ చీరకు బంగారం స్ప్రే కొట్టినట్లు గుర్తించారు. అలా 461 గ్రాముల గోల్డ్ ను లిక్విడ్ గా మార్చి స్ప్రే చేసినట్లు కస్టమ్స్ అధికారుల విచారణలో తేలింది.
చీరపై స్ప్రే చేసిన బంగారం విలువ రూ.28.01 లక్షలు ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొన్నారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.