Home > క్రైమ్ > శంషాబాద్లో 6 కోట్ల విలువైన వజ్రాలు పట్టివేత

శంషాబాద్లో 6 కోట్ల విలువైన వజ్రాలు పట్టివేత

శంషాబాద్లో 6 కోట్ల విలువైన వజ్రాలు పట్టివేత
X

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా కేటుగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. అక్రమంగా బంగారం సహా ఇతర వస్తువులను తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. ఇవాళ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న వజ్రాలు, విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఇద్దరు వ్యక్తులు దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అయితే వారి ప్రవర్తనపై అధికారులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని క్షుణ్నంగా తనిఖీ చేశారు. చాక్లెట్ కవర్లలో ప్రత్యేకంగా ప్యాక్ చేసిన రూ.6 కోట్ల విలువైన డైమండ్స్, రూ. 9.83 లక్షల విదేశీ కరెన్సీని గుర్తించారు. సరైన ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Updated : 12 Jan 2024 9:45 PM IST
Tags:    
Next Story
Share it
Top