Home > క్రైమ్ > ట్యూషన్ మాస్టర్ లైంగిక వేధింపులు.. ఆ బాలుడు ఏం చేశాడంటే

ట్యూషన్ మాస్టర్ లైంగిక వేధింపులు.. ఆ బాలుడు ఏం చేశాడంటే

ట్యూషన్ మాస్టర్ లైంగిక వేధింపులు.. ఆ బాలుడు ఏం చేశాడంటే
X

ట్యూషన్ మాస్టర్‌(28) లైంగిక వేధింపులు భరించలేక.. 14 ఏళ్ల బాలుడు అతడిని హత్య చేశాడు. దాదాపు వారం రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్య చేసిన బాలుడిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని జామియా నగర్ కు చెందిన ఆ ట్యూటర్‌.. స్వలింగ సంపర్కుడు. అతను గత కొంతకాలంగా బాలుణ్ని వేధిస్తున్నాడు.

ఓసారి బాలుడిని వేధిస్తూ.. సన్నిహితంగా ఉంటూ ఫోన్ తో వీడియో తీశాడు. రోజూ తాను చెప్పినట్లు చేయాలని.. లేదంటే ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరిస్తూ వచ్చాడు. దీంతో అతని వేధింపులు తాళలేక, ఇంట్లో జరిగిన విషయం చెప్పలేక బాలుడు తీవ్ర మనోవేదనకు గురై కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తనను వేధిస్తున్న ట్యూటర్ ను చంపేశాడు. హత్య జరిగిన రోజు బాలుణ్ని ట్యూటర్‌ జామియా నగర్‌లోని తన ఇంటికి రావాలని చెప్పాడు. దీంతో వెంట వచ్చేటప్పుడు పదునైన పేపర్‌ కట్టర్‌ తెచ్చుకున్న బాలుడు.. ట్యూటర్‌ గొంతుకోసి అక్కడి నుంచి పారిపోయాడు.

అపార్ట్‌మెంట్‌లోని వారు గది నుంచి రక్తం రావడం చూసి పోలీసులకు సమాచారమందించారు. వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో బాలుడితో ట్యూటర్‌ చేసిన ఆ వీడియో వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల గాలింపు తర్వాత నిందితుణ్ని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

Updated : 3 Sept 2023 2:16 PM IST
Tags:    
Next Story
Share it
Top