Home > క్రైమ్ > పెళ్లి కాకుండానే తల్లిని చేసిండు.. చివరకు..

పెళ్లి కాకుండానే తల్లిని చేసిండు.. చివరకు..

పెళ్లి కాకుండానే తల్లిని చేసిండు.. చివరకు..
X

ఓ యువతి కుటుంబంతో కలిసి ఓ ఇంట్లో కిరాయికి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటి ఓనర్ కుమారుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ ఒక్కోసారి గుడ్డిగా మారుతుందన్నట్లు ఆ యువతి అతడిని గుడ్డిగానే నమ్మింది. దీన్ని ఆసరాగా చేసుకున్న అతడు ఆమెను వంచించి గర్భవతిని చేశాడు. తీరా చూస్తే ఇప్పుడు మొఖం చాటేశాడు. ప్రస్తుతం ఆ యువతి మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో జరిగింది. హనుమాన్‌నగర్‌ కాలనీలో మోకిల గ్రామానికి చెందిన బాధిత యువతి కుటుంబం ఓ ఇంట్లో రెండేళ్లుగా కిరాయికి ఉంటున్నారు. ఇంటి ఓనర్‌ కుమారుడు కార్తీక్‌ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంకేముంది చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కట్ చేస్తే యువతి గర్భవతి అయ్యింది. దీంతో కథ కుటుంబాల వరకు వెళ్లింది.

ఈ క్రమంలో ఇరు కుటుంబీకుల మధ్య గొడవలు జరిగాయి. కాగా మే 24న యువతి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కార్తీక్‌ కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 1 Jun 2023 7:04 PM IST
Next Story
Share it
Top