శ్రద్ధావాకర్ తరహాలో బెంగళూరులో మరో హత్య
X
ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అది అక్కడతో ఆగిపోతేదు. మరికొన్ని అలాంటి హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూరులో కూడా ఇలాంటి హత్యే మరొకటి జరిగింది. తాను రిలేషన్ షిప్ లో ఉన్న మహిళ మీద అనుమానంతో ప్రెషర్ కుక్కర్ తో కొట్టి మరీ చంపేశాడు ఓ దుర్మార్గుడు.
బెంగళలూరులోని బేగూర్ లోని మేకో లేఅవుట్ లో జరిగిందీ ఘటన. శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. కేరళలోని తిరువనంతపురానికి చెందిన 24 ఏళ్ళ దేవా అనే అమ్మాయి, కొల్లాంకు చెందిన 20ఏళ్ళ వైష్ణవ్ రెండేళ్ళుగా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. వీళ్ళిద్దరూ బెంగళూరులో అపార్ట్ మెంట్ తీసుకుని ఉండేవారు. సేల్స్, మార్కెటింగ్ జాబ్స్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారుట. దేవా మీద వైష్ణవ్ అనుమానం పెంచుకున్నాడు. దీని కోసమే గొడవ పడుతూ...ఆ అమ్మాయిని వైష్ణవ్ ప్రెషర్ కుక్కర్ తో కొట్టి చంపాడు.
సంఘటన జరిగిన తర్వాత దేవా సిస్టర్ ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఎంతకూ ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ముందు చుట్టుపక్కల వారిని విచారించింది. తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది దేవా సోదరి. హత్య తర్వాత వైష్ణవ్ పారిపోయాడు. కానీ పోలీసులు అతడిని వెతికి పట్టుకున్నారు. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని దక్షిణ బెంగళూరు సీనియర్ పోలీసు అధికారి సికె బాబా తెలిపారు.