Home > క్రైమ్ > హత్యా? ఆత్మహత్యా.?.. అసిస్టెంట్ కలెక్టర్‌కు వేధింపులు.. చివరకు

హత్యా? ఆత్మహత్యా.?.. అసిస్టెంట్ కలెక్టర్‌కు వేధింపులు.. చివరకు

హత్యా? ఆత్మహత్యా.?.. అసిస్టెంట్ కలెక్టర్‌కు వేధింపులు.. చివరకు
X

ఒడిశాలోని రవుర్కెలా అసిస్టెంట్ కలెక్టర్‌ సస్మిత మింజ్‌ (35) .. ఆకస్మిక మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలోని అసిస్టెంట్ కలెక్టర్‌ ఆఫీస్ లో కొంతమంది అధికారులు వేధించడం వల్ల ఆమె మృతి చెందినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని లేదా హతమార్చి జలాశయంలో విసిరేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నెల సెప్టెంబర్ 15న విధులకు వెళ్లిన సస్మిత.. తిరిగి ఇంటికి రాలేదు. 17వ తేదీన ఆమె సిటీలోని ఒక హోటల్లో ఉన్నట్లు తెలిసింది. ఇది తెలిసిన తల్లి, తమ్ముడు హోటల్‌కి వెళ్లి ఆమెను కలవాలని ప్రయత్నించిగా.. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఆఫీస్ లో ఒత్తిడి ఎక్కువగా ఉందని, తనకు రెస్ట్ కావాలని, తాను ఎవరినీ కలుసుకోనని తెలిపారు.

ఆ తర్వాత రెండు రోజులకు సెప్టెంబర్ 19న, మంగళవారం పట్టణంలోని ఓ చెరువులో సస్మిత శవమై కనిపించింది. సిటీలో ఉన్న సెంచరీ పార్కు ప్రాంగణంలోని చెరువులో ఆమె మృతదేహం కనిపించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... మంగళవారం సాయంత్రం పార్కులో ఉన్న జలాశయంలో మహిళ మృతదేహం తేలుతూ కనిపించడంతో సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అగ్నిమాపక సిబ్బందిని తీసుకుని వచ్చి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతదేహం సహాయ కలెక్టర్‌ది అని గుర్తించారు. జలాశయం తీరంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్‌, జోళ్ళు లభించాయి. మృతదేహాన్ని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. సస్మిత తన భర్త నుంచి విడిపోయి విడాకులకు సిద్ధమైన తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.


Updated : 22 Sept 2023 9:53 AM IST
Tags:    
Next Story
Share it
Top