Home > క్రైమ్ > ఇన్సూరెన్స్ కోసం ఎంత డ్రామా..బెడిసికొట్టిన నగల వ్యాపారి స్కెచ్

ఇన్సూరెన్స్ కోసం ఎంత డ్రామా..బెడిసికొట్టిన నగల వ్యాపారి స్కెచ్

ఇన్సూరెన్స్ కోసం ఎంత డ్రామా..బెడిసికొట్టిన నగల వ్యాపారి స్కెచ్
X

వ్యాపారులు వారి షాపులకు, షోరూమ్‎లకు ఇన్సూరెన్స్ చేయించడం సహజమే. కోట్లల్లో లావాదేవీలు జరిపే అన్ని రంగాల వారు వారి షాపులకు ఇన్సూరెన్స్ చేస్తుంటారు. దొంగలు షాపులను లూటీ చేసినా, ప్రమాదం జరిగినా నష్టపోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఇన్సూరెన్స్ చేయిస్తారు. కానీ ఓ వ్యాపారి బీమా డబ్బుల కోసం డ్రామా వేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. సిటీ మార్కెట్ సమీపంలోని నగల షాపు యజమాని రాజు జైన్ తన దగ్గర ఉన్న 2.7 కిలోల బంగారం చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్కెట్ ఫ్లైఓవర్‎పై వెళ్తుండగా ఈ చోరీ జరిగిందని . రాజు జైన్ పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు ప్రత్యేక టీమ్‎లను ఏర్పాటు చేసి దొంగల కోసం వేట ప్రారంభించారు. విచారణలో పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. బీమా డబ్బుల కోసం యజమాని రాజుజైన్ ఈ దొంగతనం చేయించాడని గుర్తించారు. తమదైన స్టైల్ లో విచారణ చేయడంతో రాజు జైన్ నేరం ఒప్పుకున్నాడు. బీమా డబ్బుల కోసమే ఈ చోరీ ప్లాన్ చేశానని అంగీకరించాడు. దీంతో పోలీసులు రాజు జైన్ తో పాటు అతడికి సహకరించిన వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.మొత్తానికి బీమా డబ్బుల కోసం కన్నింగ్ స్కెచ్ వేసిన వ్యాపారి ఇప్పుడు కటకటాలపాలయ్యాడు.




Updated : 31 July 2023 12:30 PM GMT
Tags:    
Next Story
Share it
Top