Home > క్రైమ్ > ఎయిర్ హోస్టెస్‌కు ముద్దుపెట్టి, చేతిప్రయోగం చేసుకుంటూ.. బంగ్లాదేశీ గలీజ్ పని..

ఎయిర్ హోస్టెస్‌కు ముద్దుపెట్టి, చేతిప్రయోగం చేసుకుంటూ.. బంగ్లాదేశీ గలీజ్ పని..

ఎయిర్ హోస్టెస్‌కు ముద్దుపెట్టి, చేతిప్రయోగం చేసుకుంటూ.. బంగ్లాదేశీ గలీజ్ పని..
X

విమానంలో కొంతమంది ప్రయాణికులు మానవ జాతే కాదు, జంతుజాతులు కూడా సిగ్గుపడేలా వికృతంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు పక్కసీటులోని ప్రయాణికులపై మూత్రవిసర్జన చేస్తుంటే కొందరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అలాంటి వారిని జైలుకు పంపినా ఫలితం ఉండడం లేదు. తాజా విస్తారా విమానంలో ఓ ప్రయాణికుడు బీభత్సానికి పాల్పడ్డాడు. 22 ఏళ్ల ఎయిర్ హోస్టెస్‌ను ముద్దుపెట్టుకుని వేధించాడు. ప్యాంటు విప్పి హస్తప్రయోగం కూడా చేసుకున్నాడు. విమాన సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని ముంబై పోలీసులకు అప్పగించారు.

యెమన్ రాజధాని మస్కట్ నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వెళ్తున్న విమానంలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 6న విస్తారా విమానం ‘యూకే 234’ మస్కట్‌ నుంచి ఢాకాకు టేకాఫ్ తీసుకుంది. దారిమధ్యలో గురువారం వేకువజామున ముంబైలో దిగుతుండగా మహమ్మద్‌ దులాల్‌ అనే వ్యక్తి 30 ఏళ్ల యువకుడు సీటులోంచి పైకి లేచాడు. స్వయంతృప్తికి పాల్పడి, పక్కనే ఉన్న ఎయిర్‌ హోస్టెస్‌ను గట్టిగా వాటేసుకుని ముద్దుపెట్టాడు. ఆమె భయపడిపోయింది. ప్రయాణికులు సిబ్బంది అతణ్ని అడ్డుకున్నారు. అతడు వారితోనూ దురుసుగా ప్రయత్నించాడు. సిబ్బంది అతణ్ని బంధించి ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. సహార్ పోలీసులు దులాల్‌ను కోర్టుకు హాజరు పరచగా రిమాండ్‌కు ఆదేశించారు.

Updated : 8 Sept 2023 8:12 PM IST
Tags:    
Next Story
Share it
Top