Home > క్రైమ్ > ఏటీఎం పగలకపోవడంతో లారీ వేసుకెళ్లిన దొంగలు

ఏటీఎం పగలకపోవడంతో లారీ వేసుకెళ్లిన దొంగలు

ఏటీఎం పగలకపోవడంతో లారీ వేసుకెళ్లిన దొంగలు
X

ఇప్పుడు పిక్ ప్యాకెట్ దొంగతనాలు చాలావరకు తగ్గాయి. ఎవరి జేబుల్లోనూ నోట్ల కనిపించడం లేదు. కాస్త అక్షరజ్ఞానం ఉన్న అందరూ మొబైల్ ఫోన్లలో డిజిటల్ లావాదేవీలతో పనికానిచ్చేస్తున్నాయి. బంగారం ఉంగరమైనా, కొత్తిమీర కట్టయినా స్కాన్ చేసి పే చేస్తున్నారు. దీంతో చేతివాటం దొంగలకు కష్టకాలం వచ్చిపడింది. ఇళ్లలోకి దూరి కొట్టేద్దామనుకుంటే ప్రతి ఇంటా సీసీ కెమెరాలే. తలుపులు, కిటికీలు బద్దలు కొట్టి లోపలికి వెళ్లినా నగదో, బంగారమో ఉంటుందనే గ్యారెంటీ లేదు. టైమ్ బాలేకపోతే దొరికిపోవచ్చు కూడా. అందుకే క్యాష్ దండిగా ఉంటే ఏటీఎంలను టార్గెట్ చేస్తున్నారు. ఏటీఎంలోలనూ కెమెరాలు ఉన్నా, వాటిని బద్దలు కొట్టి, మంటపెట్టి నానా ఘోరాలకు తెగబడి నోట్లు ఎత్తుకుపోతున్నారు. అదీ వీలుకాకపోతే , ‘‘డబ్బానే లేపేద్దాంరా,’’ అంటూ ఏటీఎంకు ఏటీఎంనే ఎత్తుకెళ్లిపోతున్నారు.

మహారాష్ట్రలోని నాసిక్‌లో అలాంటి సంఘటనే జరిగింది. నగర శివారులోని సుమన్‌గావ్‌లో ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి వెళ్లిన దొంగలు దాన్ని పగలగొట్టి డబ్బు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే మిషన్ ఎంతకొట్టినా పగలకపోయేసరికి లారీ తెప్పించి, అందులో వేసుకుని పారిపోయారు. ముసుగులు, రెయిన్ కోట్లు వేసుకున్న నలుగురు దొంగలు ఈ దారుణానికి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. గత బుధవారం తెల్లవారుజమున ఈ సంఘటన జరింది. ఓ స్థానికుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొంగల కోసం విస్తృతంగా గాలింపు మొదలైంది. ఏటీఎంలో పది లక్షలకుపైగా క్యాష్ ఉందని బ్యాంకు అధికారులు చెప్పారు.


Updated : 10 July 2023 12:02 PM GMT
Tags:    
Next Story
Share it
Top