Home > క్రైమ్ > ప్రాణం తీసిన 'మోమోస్ ఛాలెంజ్'.. యువకుడు మృతి

ప్రాణం తీసిన 'మోమోస్ ఛాలెంజ్'.. యువకుడు మృతి

ప్రాణం తీసిన మోమోస్ ఛాలెంజ్.. యువకుడు మృతి
X

స్నేహితులతో కాసిన పందెం ఓ యువకుడి నిండుప్రాణాలను తీసింది. ఎక్కువ మోమోలు(మోదకాలు) తిన్న వ్యక్తి .. అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. సరదా చేసిన ఘటన ఇలా విషాదంగా మారింది. ఈ ఘటన బీహార్ లోని సివాన్ జిల్లాలోని బదిహరియా పోలీస్ స్టేషన్ పరిధిలోకి చోటుచేసుకుంది. స్థానిక మొబైల్ రిపేర్ షాపులో పనిచేబిపిన్ కుమార్ పాశ్వాన్ అనే యువకుడు.. తన స్నేహితులతో కలసి ఓ ఫాస్ట్ పుడ్ సెంటర్ కు వెళ్లారు. ఈ సమయంలో స్నేహితులందరూ కలిసి ఎవరు ఎక్కువ మోమోస్ తింటారో అంటూ. . ఒకరినొకరు సవాలు చేసుకున్నారు. ఆ ఛాలెంజ్‌ లో భాగంగా బిపిన్ పాశ్వాన్ ఏకంగా 150 మోమోలు తిన్నాడని తెలుస్తోంది. అయితే.. ఒకేసారి అన్ని మోమోస్ తినేసరికి అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయాడు. వెంటనే అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాశ్వాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

బిపిన్ పాశ్వాన్ ను అతని స్నేహితులే హత్య చేశారని తండ్రి ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే తన కొడుక్కి మోమోస్ తినే ఛాలెంజ్‌ని విసిరారని, ఈ చర్యలో తన కుమారుడికి విషం ఇచ్చారని ఆయన ఆరోపించారు. మృతిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు పాశ్వాన్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. పాశ్వాన్ ఆకస్మిక మరణంతో కుటుంబం మొత్తం షాక్‌కు గురైంది. ఈ ఘటన ఆ ప్రాంతంలోనూ కలకలం రేపింది. మొమోస్ పూర్తిగా నమిలిన తర్వాతే తినాలని, అలా నమలకపోతే ఆకస్మికంగా చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు సూచించారు.

Updated : 16 July 2023 10:42 AM IST
Tags:    
Next Story
Share it
Top