Home > క్రైమ్ > దారుణం..చెల్లిని ప్రేమిస్తున్నాడని హత్య !

దారుణం..చెల్లిని ప్రేమిస్తున్నాడని హత్య !

దారుణం..చెల్లిని ప్రేమిస్తున్నాడని హత్య !
X

యువతి నేరాల బాట పడుతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడడం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెల్లిని ప్రేమిస్తున్నాడనే కారణంతో ఒక యువకుడ్ని ఆమె అన్నయ్య కిరాతకంగా హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే చంపేశాడు.

కోహిర్ మండలం పిచ్చరేగడి తండాకు చెందిన 19 ఏళ్ళ సుదీప్..అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. కొంతకాలంగా ఈ వ్యవహారం సాగుతోంది. ఇటీవల సుదీప్ ప్రేమ వ్యవహారం యువతి అన్నయ్య అరుణ్ (19) కి తెలియడంతో అతడు కోపంతో రగిలిపోయాడు. సుదీప్‌పై కక్ష పెంచుకున్న అరుణ్ అతడిని హత్య చేయాలని భావించాడు. అనుకున్న విధంగా బుధవారం అదును చూసి సుదీప్‌‌పై దాడి చేశాడు. నా చెల్లెలినే ప్రేమిస్తావా? అంటూ గొడ్డలితో విచక్షణ రహితంగా నరికేశాడు. ఈ దాడిలో సుదీప్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

అందరూ చూస్తుండగానే ఈ హత్య జరిగింది. కానీ ఎవరూ ఆపేందుకు ముందుకు రాలేదు. అందికొస్తున్న కొడుకు హత్యకు గురవ్వడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సుదీప్ మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పరారీలో ఉన్న నిందితుడు అరుణ్ కోసం గాలింపు కొనసాగుతోంది.

Updated : 19 July 2023 7:12 PM IST
Tags:    
Next Story
Share it
Top