Home > క్రైమ్ > దారుణం.. మైనర్ చెల్లి లవ్ అఫైర్.. తల నరికి ఊరేగించిన అన్న

దారుణం.. మైనర్ చెల్లి లవ్ అఫైర్.. తల నరికి ఊరేగించిన అన్న

దారుణం.. మైనర్ చెల్లి లవ్ అఫైర్.. తల నరికి ఊరేగించిన అన్న
X

ఉత్తరప్రదేశ్ లో మరో పరువు హత్య సంచలనం సృష్టించింది. తన మైనర్ సోదరి వేరే వ్యక్తిని ప్రేమించి, అతనితో పారిపోయిందని కక్ష గట్టిన అన్న.. తన తల నరికి ఊరేగించి అందరినీ భయబ్రాంతులకు గురిచేశాడు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లా మిత్వారా గ్రామంలో జరిగింది. మిత్వారా గ్రామానికి చెందిన ఆసిఫా బనో తన మతానికి చెందిన చాంద్ బాబును ప్రేమించింది. ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరనే కారణంతో.. మే 25న లేచిపోయారు. ఈ ఘటనపై ఆసిఫా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా.. చుట్టు పక్కల గాలించిన పోలీసులు వీరిద్దరికి పట్టుకున్నారు. ఆసిఫా ప్రేమించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి జైల్ లో పెట్టారు. అయితే, ఆసిఫా చేసిన పనిని జీర్ణించుకోలేకపోయిన అన్న రియాజ్ (25) తరచూ గొడవ పడేవాడు.

శుక్రవారం ఇంట్లో ఎవరు లేనిది చూసిన రియాజ్.. ఆసిఫాపై కత్తితో దాడి చేసి.. తల నరికాడు. తర్వాత మొండెం నుంచి తలను వేరు చేసి ఊరేగించాడు. అనంతరం పోలీసులకు లొంగి పోయేందుకు స్టేషన్ వైపు వెళ్తుండగా.. స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు విషయం తెలియజేయగా.. మర్గమధ్యలో రియాజ్ ను అడ్డుకుని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. తర్వాత రియాజ్ ను విచారించగా.. ఊళ్లో తమ పరువు తీసిన కారణంగా తన సోదరిని హత్య చేసినట్లు వివరించాడు.






Updated : 22 July 2023 5:33 PM IST
Tags:    
Next Story
Share it
Top