Home > క్రైమ్ > చికోటి ప్రవీణ్ గన్‌మెన్ తుపాకుల కేసులో ట్విస్ట్..

చికోటి ప్రవీణ్ గన్‌మెన్ తుపాకుల కేసులో ట్విస్ట్..

చికోటి ప్రవీణ్ గన్‌మెన్ తుపాకుల కేసులో ట్విస్ట్..
X

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ చాలా కళల్లో రాటుదేలాడు. ప్రాణహాని ఉందని ప్రైవేట్ గార్డులు పెట్టుకుని ప్రజాప్రతినిధిలా పోజులు కొడుతూ తిరుగుతున్న ప్రవీణ్ ఈ వ్యవహారంలోనూ అక్రమార్కుడేనని తేలిసింది. అతని గార్డుల తుపాకీ లైసెన్సులు ఫోర్జరీ లైసెన్సులని తేలింది. వారిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం లాల్ దర్వాజా అమ్మవారి గుడి వద్ద ప్రైవేట్ చికోటి ప్రవీణ్ రచ్చ చేశాడు. బాడీ గార్డులతో లోపలికి వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేయడంతో తుపాకులు దొరికాయి. వారిని ఛత్రినాక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇద్దరి తుపాకులకు ఫోర్జరీ లైసెన్సులు ఉన్నట్లు గుర్తించారు.

కాగా, పోలీసులు తనపై కక్షగట్టారని చికోటి అంతకు గుడి దగ్గర ఆరోపించాడు. తన గార్డుల తుపాకులకు లైసెన్స్ ఉందని చెబుతున్నా కొట్టుకుంటూ తీసుకెళ్లారని మండిపడ్డారు. చికోటి అనుమతి లేకుండా మన దేశంతోపాటు పలు దేశాల్లో క్యాషినోలు నిర్వహిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు పలు కేసులు నమోదైన సంగతి తెలిసింది. అతనికి పోలీసులతో, రాజకీయ నాయకులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని, ముడుపులు ముట్టజెప్పి దందా సాగిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

Updated : 17 July 2023 8:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top