Home > క్రైమ్ > రోడ్డుపై పేలిన కెమికల్ ట్యాంకర్ ..నలుగురి దుర్మరణం

రోడ్డుపై పేలిన కెమికల్ ట్యాంకర్ ..నలుగురి దుర్మరణం

రోడ్డుపై పేలిన కెమికల్ ట్యాంకర్ ..నలుగురి దుర్మరణం
X

పుణె - ముంబై ఎక్స్‎ప్రెస్‌‌వే పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ ట్యాంకర్ పేలిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.

పుణె వెళ్తున్న కెమికల్ ట్యాంకర్‌లో మొదట మంటలు చెలరేగాయి. దానిలో ఉన్న ప్రమాదకర రసాయనం కారణంగా మంటలు ఒక్కసారిగా ఎగసిబడ్డాయి. దీంతో ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా, అందులోని మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటువైపు వస్తున్న మిగిలిన వాహనదారులపై మంటలతో కూడిన ఆ రసాయనం పడడంతో పలువురు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు ప్రాణాలు వదిలారు. ట్యాంకర్ సహా మొత్తం 4 వాహనాలు తగలబడ్డాయి. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఐదుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పుణె - ముంబై ఎక్స్ ప్రెస్ వే పై ఖండాలా ఎగ్జిట్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated : 13 Jun 2023 7:40 PM IST
Tags:    
Next Story
Share it
Top