Home > క్రైమ్ > ఏటీఎంలో జమచేయాల్సిన డబ్బులు స్వాహా.. ఆ తర్వాత..

ఏటీఎంలో జమచేయాల్సిన డబ్బులు స్వాహా.. ఆ తర్వాత..

ఏటీఎంలో జమచేయాల్సిన డబ్బులు స్వాహా.. ఆ తర్వాత..
X

గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఏటీఎంలో జమ చేయాల్సిన సొమ్మును కొందరు ఉద్యోగులు కాజేశారు. దాదాపు కోటి 12 లక్షల బ్యాంకు సొమ్మును సీఎంఎస్ సంస్థ సిబ్బంది స్వాహా చేశారు. సీఎంఎస్ సంస్థ పలు బ్యాంకుల ఏటీఎంలలో నగదు జమ చేస్తుంది. అయితే అందులో పనిచేస్తున్న కొందరు.. బ్యాంకుల ఏటీఎంలలో నగదు జమ చేయకుండా దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది.

దాదాపు కోటి 12 లక్షల నగదుకు సంబంధించిన లెక్కలు తేడా రావడంతో యాజమాన్యం క్యాష్ జమచేసే సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ భారీ స్కామ్ వెలుగుచూసింది. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ స్కామ్‌కు పాల్పడ్డ ప్రధాన సూత్రధారుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి.

Updated : 19 July 2023 12:01 PM IST
Tags:    
Next Story
Share it
Top