దూసుకొచ్చిన కాలేజ్ బస్సు.. జీహెచ్ఎంసీ వర్కర్ మృతి
X
హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కింగ్ కోఠిలో కాలేజ్ బస్ ఢీకొని జీహెచ్ఎంసీ కార్మికులు మృతి చెందింది. రోడ్డు పక్కన చెత్త ఊడుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కింగ్ కోఠిలో ఉదయం 7:45 గంటలకు జీహెచ్‌ఎంసీ స్వీపర్ టి.సునీత విధులు నిర్వహిస్తున్నారు. రోజూ మాదిరిగానే రోడ్డు పక్కన చెత్తను ఊడుస్తుండగా స్కూల్ బస్సు ఒక్కసారిగా దూసుకొచ్చింది. న్నారు. అతివేగంతో దూసుకొచ్చిన అయాన్ ఇన్స్టిట్యూట్ మెడికల్ కాలేజ్ బస్ రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. అక్కడే పనిచేస్తున్న సునీత చెట్టు - బస్సు మధ్య ఇరుక్కుని స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బస్సును సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.