Home > క్రైమ్ > హనుమకొండ జిల్లాలో దారుణం.. అత్తను చంపిన కానిస్టేబుల్

హనుమకొండ జిల్లాలో దారుణం.. అత్తను చంపిన కానిస్టేబుల్

హనుమకొండ జిల్లాలో దారుణం.. అత్తను చంపిన కానిస్టేబుల్
X

రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. డబ్బు విషయంలో అత్తతో గొడవపడిన ఓ కానిస్టేబుల్.. తీవ్ర ఆవేశానికి లోనై ఆమెను అత్తను అతి దారుణంగా హతమార్చాడు. జిల్లాలోని గుడ్ల సింగారంలో ఈ ఘటన జరిగింది. తోటపల్లి(మండలం) పోలీస్ స్టేషన్‌లో రైటర్ గా పనిచేస్తున్న ప్రసాద్ అనే కానిస్టేబుల్‌.. తన అత్త కమలమ్మను చంపేశాడు. గురువారం ఉదయం.. రూ. 4 లక్షల అప్పు విషయంలో అత్తింటికి వచ్చి గొడవపడ్డ ప్రసాద్.. గొడవ జరుగుతున్న క్రమంలోనే కోపంలో చేతిలో ఉన్న తుపాకీతో కమలమ్మపై కాల్పుల వర్షం కురిపించాడు. ఆ పేలుళ్లలో కమలమ్మకు రెండు బుల్లెట్లు తగిలాయి. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది.

తుపాకీ పేలుళ్ల శబ్ధం వినపడగానే.. చుట్టూపక్కల వారంతా అక్కడికి పరుగున వచ్చారు. ఇంటిముందు రక్తపు మడుగులో ఉన్న కమలమ్మను చూసి అక్కడికి చేరుకున్న వారంతా షాకయ్యారు. వెంటనే పోలీసులకు ఈ విషయం గురించి సమాచారం అందించారు. హత్య జరిగిన సమయంలో కమలమ్మ కూతురు, ప్రసాద్ భార్య అక్కడే ఉంది. ఈ ఘటన తర్వాత ప్రసాద్ ఆ ఇంట్లోని గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. కమలమ్మ మృతదేహం వద్ద ఏడుస్తున్న ఆమె కూతురికి ఇంట్లో నుంచి మరోసారి తుపాకీ శబ్ధం వినపడగా.. ఆమెతోపాటు, అక్కడున్న స్థానికులు పరుగున లోపలికి వెళ్లారు. గదిలో ప్రసాద్ అదే తుపాకీతో పేల్చుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలపాలైన అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అతని పరిస్థితి విషమంగానే ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Updated : 12 Oct 2023 1:58 PM IST
Tags:    
Next Story
Share it
Top